Bigg Boss: బిగ్ బాస్ 9 లో వైల్డ్ కార్డ్ రచ్చ.. డ్రామాకు తెర లేపిన దివ్వెల మాధురి
Bigg Boss: మొత్తంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆడిషన్స్‌కు కావాల్సినంత మసాలా దొరికినట్లు అయిందనే చెప్పొచ్చు.

Bigg Boss
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డు ఎంట్రీలతో హౌస్ (Bigg Boss)ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. ఈ ఆదివారం (అక్టోబర్ 13, 2025) మొత్తం ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ గ్రాండ్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీరిలో నలుగురు సెలబ్రిటీలు, ఇద్దరు కామనర్స్ ఉన్నారు.
కొత్త కంటెస్టెంట్లలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష,టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దివ్వెల (దువ్వాడ) మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్,సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా ఉన్నారు.
కాగా కొత్త కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది. తాజాగా విడుదలైన నేటి ఎపిసోడ్ ప్రోమోలో దివ్వెల మాధురి వెక్కి వెక్కి ఏడవడం కనిపించింది. ఇమ్మాన్యుయేల్, సంజన, దివ్య, కళ్యాణ్ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో కళ్యాణ్, మాధురిని పిలిచాడు. ఆమె రాగానే కళ్యాణ్ మర్యాదపూర్వకంగా “రండి, కూర్చోండి” అన్నాడు. దీనికి మాధురి ఒక్కసారిగా “కూర్చోకపోతే ఊరుకోరా..?” అంటూ వెటకారంగా మాట్లాడింది.
దానికి కళ్యాణ్, “ఈ రోజు ఇలా ఉంది, రేపటి నుంచి షెడ్యూల్ మారుస్తాం” అని చెప్పగా, మాధురి వెంటనే సీరియస్ అయ్యింది. “నేను ఇక్కడికి వచ్చి అరగంట అయ్యింది, అప్పుడు చెప్పొచ్చుగా ఏం చేస్తున్నారు? అప్పుడు తెలియదా?” అని సీరియస్‌గా మాట్లాడింది.

మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి ఉంటుంది” అని కళ్యాణ్ అనడంతో, మాధురి మరింత రెచ్చిపోయి “మాట్లాడండి!” అంటూ వెటకారంగా రెచ్చగొట్టింది. దీనితో చిన్న వాగ్వాదం మొదలైంది. దివ్య మధ్యలో జోక్యం చేసుకుని “మీరు ఇక్కడ లేరు, అందుకే చెప్తున్నా, గొడవ పడాలని కాదు” అని వివరించడానికి ప్రయత్నించగా, మాధురి కుకింగ్ టీమ్‌లో తాను ఒక్కదాన్నే కాదని, ఇంకో ముగ్గురు కూడా ఉన్నారని చెబుతూ దివ్యపైన కూడా రెచ్చిపోయింది.
ఈ గొడవ చివరకు మాధురి, కళ్యాణ్ పై “వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి?” అంటూ సీరియస్ అవ్వడం, దానికి కళ్యాణ్ కూడా గట్టిగా అరిచి మాట్లాడడం, ఆ తర్వాత దివ్య, మాధురి మధ్య కూడా వాగ్వాదం జరగడంతో రచ్చ పెద్దదైంది.
చివరికి, మాధురి పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై స్పందించిన కళ్యాణ్, భరణి వద్ద “అనాల్సిన మాటలన్నీ అని ఇప్పుడు ఏడిస్తే ఎలా?” అని అసహనం వ్యక్తం చేశాడు.మొత్తంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆడిషన్స్‌కు కావాల్సినంత మసాలా దొరికినట్లు అయిందనే చెప్పొచ్చు.