AI Hub :విశాఖపట్నంలో గూగుల్ AI హబ్ ..ఏపీ భవిష్యత్‌ను మార్చబోయే దేశంలోనే తొలి AI సిటీ
AI Hub : గూగుల్ AI హబ్ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)కి ఒక్క సంవత్సరానికి సగటున రూ. 10,518 కోట్ల మేర అదనపు వృద్ధి లభిస్తుంది.

AI Hub
విశాఖపట్నంలో దాదాపు రూ. 87,000–రూ. 88,000 కోట్లు (సుమారు US$10 బిలియన్) విలువైన దేశంలోనే తొలి ‘గూగుల్ AI హబ్’ (Google AI Hub) ఏర్పాటు కావడం ఐటీ, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో ఒక గొప్ప సంచలనం. ఈ ప్రాజెక్ట్ విశాఖ భవిష్యత్తును పూర్తిగా మార్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సాంకేతిక మైలురాయిగా నిలవనుంది.
ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 87,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇది 1 గిగావాట్ (GW) హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను కలిగి ఉంటుంది, ఇది ఆసియాలో గూగుల్‌కు అత్యంత పెద్ద డేటా సెంటర్‌లలో ఒకటిగా మారనుంది.
ఈ భారీ(AI Hub) ప్రాజెక్ట్ విశాఖపట్నంలో మూడు క్యాంపస్‌లుగా విస్తరించి ఉంటుంది .. అవి అడవివరం, తార్లువాడ,రాంబిల్లి. నిర్మాణం 2028లో మొదలవనుండగా, తొలి ఐదేళ్లలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
విశాఖకు, రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనాలు..
ప్రాజెక్ట్ వల్ల రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)కి ఒక్క సంవత్సరానికి సగటున రూ. 10,518 కోట్ల మేర అదనపు వృద్ధి లభిస్తుంది.తొలి ఐదేళ్లలో రాష్ట్రానికి మొత్తం రూ. 47,720 కోట్ల డిజిటల్ ఎకానమీ లాభం చేకూరనుంది.
ఇది ప్రైవేట్ , చిన్న మధ్య తరహా సంస్థల (SME) సెక్టార్లకు గ్లోబల్ మల్టిప్లయర్ ఎఫెక్ట్‌ను తెస్తుంది. సప్లై చైన్, నిర్మాణం, రియల్ ఎస్టేట్, విద్యుత్ (పవర్) వంటి అనుబంధ రంగాలన్నీ విపరీతంగా వృద్ధి చెందుతాయి.
దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా (Direct + Indirect) కలిపి మొత్తం 1,88,220 ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా నిర్మాణం, డేటా సెంటర్ ఆపరేషన్, ఐటీ, ఇంజనీరింగ్, సప్లై చైన్ సెక్టార్లలో ఉద్యోగాలు పెరుగుతాయి.
టెక్, డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాములు , AI సర్టిఫికేషన్ క్యాంపస్‌లు సిద్ధమవుతాయి.స్థానిక యువత ,విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, అప్లైడ్ AI అధ్యయన కోర్సుల ద్వారా అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.

టెక్ బూమ్ – విశాఖపట్నం ఎంపిక వెనుక కారణాలు..
విశాఖ ప్రపంచంలోని ప్రధాన డేటా హబ్‌లతో అనుసంధానం అయ్యేందుకు వీలుగా సముద్రపు కేబుల్ , అండర్ గ్రౌండ్ ఫైబర్ కనెక్టివిటీని కలిగి ఉంది.ఇది పునరుత్పాదక శక్తి (Renewable Energy) మీద ఆధారపడే ‘ఫస్ట్ గ్రీన్ డాటా సిటీ’ గా రూపొందుతోంది.
డేటా సెంటర్ అవసరాల కోసం సొంత గ్రీన్ పవర్ హబ్‌ను ఏర్పాటు చేసుకుని, దేశ-ప్రాంతీయ పవర్ గ్రిడ్‌లకు మద్దతు ఇస్తుంది.ఈ హబ్ స్థానిక ఇంటర్నెట్, టెలికాం, జర్నలిజం, క్లౌడ్, అనలిటిక్స్ రంగాల్లో భారీ మార్పులు తీసుకురానుంది.
నగర రూపురేఖల్లో మార్పు – ‘AI CITY VISAKHAPATNAM’..
ఈ ప్రాజెక్ట్‌తో విశాఖకు “AI City” అనే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న AI, క్లౌడ్, డేటా అనలిటిక్స్ నిపుణులు, కంపెనీలు ఇక్కడ సెటప్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. నగరంలో భారీ రహదారి నెట్‌వర్క్, మెట్రో, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, ప్రపంచ స్థాయి హౌసింగ్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి.
AI-ఆధారిత స్టార్టప్ ల్యాబ్స్, క్లౌడ్-బేస్డ్ కంపెనీలు, డిజిటల్ హెల్త్ సెంటర్లు, FDI (Foreign Direct Investment) ఆకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్, పారిశ్రామిక పార్కులు, విద్యుత్ , నీటి వనరుల నాన్-స్టాప్ సరఫరా వంటి పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని (Ease of Doing Business) అందిస్తోంది.
దేశం, రాష్ట్రం దిశగా దీని ప్రయోజనం..
పెద్ద ఎత్తున తాత్కాలిక , శాశ్వత ఉద్యోగాలు లభించడం ద్వారా నిరుద్యోగిత గణనీయంగా తగ్గుతుంది. డిజిటల్ ఇండియా గోల్స్ రీచవుతాయి. అంటే విశాఖను “AI స్మార్ట్ సిటీ” మోడల్‌గా దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తే, భారతదేశం డిజిటల్ లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు.
వెనుకబడి ఉన్న ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకు ఈ ప్రాజెక్ట్ మార్గదర్శనం చేస్తుంది.అంతర్జాతీయ విద్యార్థులు , పరిశ్రమ నిపుణుల రాకతో నగర జీవనశైలి మెరుగుపడి, విశాఖకు గ్లోబల్ సిటీ అనే పేరుకు విలువ పెరుగుతుంది.
మొత్తంగా గూగుల్ AI హబ్(AI Hub)తో విశాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్, AI, క్లౌడ్ రంగాల్లో కావాల్సిన అన్నింటికీ ఒక శక్తివంతమైన వేదికగా మారుతుంది. ఉపాధి, సంపద, మౌలిక సదుపాయాలు , అంతర్జాతీయ గుర్తింపు – ఈ నాలుగు దిశలలో వైజాగ్ నగరానికి ఇది ఒక దశాబ్ద కాలపు టర్నింగ్ పాయింట్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.