Pawan Kalyan :సహనానికి హద్దులు దాటితే తాట తీస్తాం..పవన్ వార్నింగ్‌పై రాజకీయ విశ్లేషకుల అంచనా
Pawan Kalyan : అమిత్ షాతో తాను పర్సనల్‌గా మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించిన పవన్.. ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడు జైలుకు వెళ్తేనే జనసేన ఎదుగుతుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Pawan Kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఘాటుగా రియాక్టయ్యారు. కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రత్యర్థుల విమర్శలు, ముఖ్యంగా వైసీపీ నేతల తీరుపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా సరే.. వైసీపీ శైలిలో మార్పు రాకపోవడం, పర్సనల్‌గా విమర్శలు హద్దులు దాటుతుండటంతో ఈసారి పవన్ మాటల్లో కనిపించింది. దేనికైనా ఒక హద్దు ఉంటుందన్న పవన్.. ఇప్పటివరకు అన్నింటినీ భరించామన్నారు. కానీ ఇకపై చూస్తూ ఊరుకునే ఓపిక తనకు లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే తాట తీస్తానంటూ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ భేటీలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మెయిన్‌గా కుల రాజకీయాలతో పాటు, తన ఢిల్లీ పర్యటనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో యాక్టర్లు కటౌట్లు పెట్టుకుంటేనే ఈజీగా సీఎం అయిపోయారని, కానీ తాను ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు పాటు కష్టపడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అలాంటి తనను కొందరు పదే పదే ఒక కులానికే అంటగడుతూ విమర్శించడంపై మండిపడ్డారు.
తానెప్పుడూ కుల నాయకుడినని చెప్పుకోలేదని, కులాలను రెచ్చగొట్టే మనస్తత్వం సొసైటీకి అస్సలు మంచిది కాదని పవన్ క్లాస్ పీకారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన చర్చలపై విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్లను కూడా పవన్ ఖండించారు.
అమిత్ షాతో తాను పర్సనల్‌గా మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించిన పవన్.. ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడు జైలుకు వెళ్తేనే జనసేన ఎదుగుతుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము ఢిల్లీ వెళ్లేది కేవలం ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసమే తప్ప, ఎవరినో అరెస్ట్ చేయించడానికి కాదని చెప్పుకొచ్చారు. లాజిక్ ప్రకారం తాను అనుకుంటే చంద్రబాబు జైలుకెళ్లినప్పుడే సీఎం అయ్యేవాడిని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేవలం ఎన్నికల సమయంలో లేదా అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసేవారని ఈ ఎపిసోడ్‌లో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి తాను డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ మరింత కట్టుదిట్టంగా, దూకుడుగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు.
పదవులు వచ్చిన తర్వాత కొందరు జనసేన నాయకులు మెత్తబడ్డారని.. పవన్ స్వయంగా వ్యాఖ్యానించడం వెనుక పార్టీని మరింత బలోపేతం చేయాలనే కసి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తాను టీడీపీ కోసం కాకుండా, కేవలం ఏపీ భవిష్యత్తు కోసమే తాను కొన్ని విషయాల్లో సర్దుకుపోతున్నానని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ జర్నీపై క్లారిటీ ఇచ్చారు. శత్రువులు బయట ఎక్కడో లేరని, సొంత పార్టీలోనే కొందరు ఉన్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో ప్రక్షాళనకు దారి తీసేలా కనిపిస్తున్నాయి.

వైసీపీ నేతలు ఎన్నిసార్లు హెచ్చరించినా తమ బిహేవియర్ మార్చుకోకపోవడం వల్లే.. పవన్ కళ్యాణ్ ఇంత ఆగ్రహంతో మాట్లాడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. విమర్శలు చేసేటప్పుడు ప్రత్యర్థులకు కులం, ప్రాంతం గుర్తుకు రావు కానీ, తాము తిరిగి గట్టిగా కౌంటర్ ఇస్తే మాత్రం.. వెంటనే కులం కార్డును బయటకు తీస్తారని పవన్ ఎద్దేవా చేశారు.
తాను అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని, శత్రువు బలంగా ఉన్నప్పుడే ఎదుర్కుంటానని పవన్ చెప్పారు. దారిన పోయే దానయ్యలంతా జనసేన పార్టీపై రాళ్లు వేస్తామంటే ఇకపై కుదరదని, పర్సనల్‌గా విమర్శిస్తే అదే స్థాయిలో జవాబు వస్తుందని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ లోని ఈ తాజా మార్పు ఏపీ పాలిటిక్స్‌లో రాబోయే రోజుల్లో మరింత వేడిని పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Karnataka : కర్ణాటకలో మళ్లీ మొదలైన సీఎం సీటు లొల్లి..ఢిల్లీకి సిద్ధరామయ్య ..డీకేకు అందని ఆహ్వానం





