Just TechnologyJust LifestyleLatest News

300 Titanium HEV Automatic : అడ్వెంచర్ లవర్స్ కోసం మార్కెట్లోకి కొత్త టైమ్-పీస్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

300 Titanium HEV Automatic : టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్ చూడటానికి ఎంత స్టైలిష్‌గా ఉంటుందో.. అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనిలో వాడిన హై-గ్రేడ్ టైటానియం వల్ల వాచ్ వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది.

300 Titanium HEV Automatic

వాచ్ లవర్స్ , ప్రొఫెషనల్ డైవర్ల కోసం ఫేమస్ బ్రాండ్ ‘టైమెక్స్’ ఒక అదిరిపోయే ప్రీమియం వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే డీప్ వాటర్ మెరిడియన్ 300 టిటానియమ్ హెచ్‌ఈవీ ఆటోమేటిక్ (Deepwater Meridian 300 Titanium HEV Automatic). గ్రేడ్-5 టైటానియం మెటీరియల్‌తో చేసిన బాడీ, స్క్రాచ్ పడని సఫైర్ క్రిస్టల్ గ్లాస్, ఏకంగా 300 మీటర్ల లోతున్న నీటిని తట్టుకునే కెపాసిటీతో ఈ మెకానికల్ వాచ్‌ను డిజైన్ చేశారు. కొత్త అనుభూతులను ఇష్టపడే వారికి ఈ వాచ్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

స్పెషల్‌గా డీప్ సీ డైవింగ్ చేసే వారిని దృష్టిలో ఉంచుకుని దీనిలో హీలియం ఎస్కేప్ వాల్వ్ (HEV) అనే అడ్వాన్స్‌డ్ ఫీచర్‌ను చేర్చారు. 44mm డయల్‌తో, పవర్‌ఫుల్ జపనీస్ ఆటోమేటిక్ టెక్నాలజీతో వర్క్ చేసే ఈ వాచ్ సముద్రం లోపల కూడా టైమ్‌ను చాలా కరెక్టుగా చూపిస్తుంది. ఇండియన్ మార్కెట్లో దీని ధర దాదాపు రూ. 95,000 వరకు ఉంది.

టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్ చూడటానికి ఎంత స్టైలిష్‌గా ఉంటుందో.. అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనిలో వాడిన హై-గ్రేడ్ టైటానియం వల్ల వాచ్ వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ స్ట్రాంగ్‌నెస్ మాత్రం చాలా ఎక్కువ. 44mm వెడల్పు, 15mm మందంతో చేతికి పెట్టుకుంటే రాయల్ లుక్ ఇస్తుంది. దీని స్క్రీన్‌కు వాడిన సఫైర్ గ్లాస్‌పై ఎలాంటి స్క్రాచెస్ పడవు. పైగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించేలా స్పెషల్ కోటింగ్ ఇచ్చారు.

సముద్రంలో చాలా లోతుకు వెళ్లే ప్రొఫెషనల్స్ కోసం దీనిలో 300 మీటర్ల వాటర్ ప్రూఫ్ సదుపాయం ఉంది. ఎక్కువ లోతులో ఉన్నప్పుడు వాచ్ లోపల చేరే హీలియం గ్యాస్‌ను సేఫ్‌గా బయటకు పంపడానికి దీనిలో వాల్వ్ సిస్టమ్ అమర్చారు. దీనివల్ల వాచ్ గ్లాస్ పగిలిపోయే ఛాన్స్ ఉండదు. అలాగే సముద్ర గర్భంలో చీకటిగా ఉన్నా సరే, టైమ్ క్లియర్‌గా తెలీడం కోసం రేడియం లాంటి స్పెషల్ లూమినోవా కోటింగ్‌ను వాచీ ముళ్లు, నెంబర్లపై ఉపయోగించారు.

300 Titanium HEV Automatic
300 Titanium HEV Automatic

ఈ వాచ్ బ్యాటరీతో కాకుండా చేతి టచ్ ద్వారా జనరేట్ అయ్యే మెకానికల్ ఎనర్జీతో అంటే ఆటోమేటిక్ మూవ్‌మెంట్‌తో రన్ అవుతుంది. ఒక్కసారి ఇది పూర్తిగా విండ్ అయితే, మనం చేతికి పెట్టుకోకపోయినా సుమారు 40 గంటల పాటు ఆటోమేటిక్‌గా రన్ అవుతూనే ఉంటుంది. దీనికి ఇచ్చిన 20ఎమ్ఎమ్ రబ్బర్ స్ట్రాప్ చాలా క్వాలిటీతో వస్తుంది. ఇది ఎండ వేడికి, కెమికల్స్‌కు , సముద్రపు సాల్ట్ వాటర్‌కు అస్సలు పాడవదు.

సాధారణ వాచ్‌లకు ఢిపరెంట్ ప్రయాణాలు , సాహసాల కోసం ఒక ఇంజనీరింగ్ వండర్‌లా ఈ టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300ను డిజైన్ చేశారు. ప్రీమియం వాచీలను కలెక్ట్ చేసే హాబీ ఉన్నవారికి అలాగే డైవింగ్ ప్రియులకు ఇది ఒక బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు.

TIMEX Deep Water Meridian Blue Round Dial Mechanical Automatic Men's Watch – TW2Y39900UJ

Enumeration Form : ఒక ఎన్యూమరేషన్ ఫామ్.. ఎన్నో ప్రశ్నలు.. గడువు తీరితే ఓటర్ పరిస్థితేంటి?

Related Articles

Back to top button