AP Panchayat Elections : 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ .. పూర్తి షెడ్యూల్ ఇదే..
AP Panchayat Elections : రెండో విడతలో భాగంగా ఏపీవ్యాప్తంగా 4,960 సర్పంచ్ స్థానాలతో పాటు 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
AP Panchayat Elections
ఏపీలో గ్రామ పంచాయతీ(AP Panchayat Elections) ఎన్నికల సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రెండవ విడత ఎలక్షన్స్‌కు సంబంధించి నవంబర్ 16వ తేదీన అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఈ రెండో విడతలో భాగంగా ఏపీవ్యాప్తంగా 4,960 సర్పంచ్ స్థానాలతో పాటు 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రెండో విడత ఎన్నికల కాలపట్టిక చూస్తే, నవంబర్ 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా, నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 20 చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 21వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. పరిశీలనపై అభ్యంతరాలు లేదా అప్పీళ్లను నవంబర్ 22వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించి, నవంబర్ 23వ తేదీన వాటిని పరిష్కరిస్తారు.
నామినేషన్ల విత్ డ్రాకు నవంబర్ 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు పోటీలో ఉండే కేండిడేట్స్ ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు. నవంబర్ 29న పోలింగ్ తో పాటు ఓట్ల కౌంటింగ్‌ను నిర్వహిస్తారు. ఎక్కడైనా అవసరమైతే నవంబర్ 30వ తేదన రీపోలింగ్ చేపడతారు.
రెండో విడత పోలింగ్ నవంబర్ 29వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఓటింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
ఏపీలో మొదటి విడత పోలింగ్ నవంబర్ 26వ తేదీన, రెండో విడత నవంబర్ 29వ తేదీన, మూడో విడత డిసెంబర్ 2వ తేదీన జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. పోటీ చేయాలనుకునే కేండిడేట్స్ తమ గెలుపు కోసం స్ట్రాటజీలకు పదును పెడుతున్నారు.
Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?





