Just Andhra PradeshJust PoliticalLatest News

AP Pensioners : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పంచాయతీ ఎన్నికలకు ముందే పింఛన్ల పంపిణీ..

AP Pensioners : ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ వల్ల.. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నవంబర్ 30వ తేదీ నుంచే పంపిణీ చేయబోతున్నారు.

AP Pensioners

ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్‌దారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రతి నెలా ఫస్ట్ తారీఖున అందించే పెన్షన్ల డబ్బులను ఈసారి గడువు కంటే ముందే లబ్ధిదారుల చేతికి అందించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఏపీలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడో విడత పోలింగ్ డిసెంబర్ 2వ తేదీన జరగనుంది.

ఎన్నికల సమయంలో సచివాలయ సిబ్బంది, క్షేత్రస్థాయి అధికారులు పూర్తిగా ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నమై ఉంటారు. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్స్ పంపిణీలో ఎలాంటి ఆటంకాలు లేదా ఆలస్యం కలగకూడదనే ఉద్దేశంతో నవంబర్ 30వ తేదీ, డిసెంబర్ 1 తేదీల్లోనే పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని యంత్రాంగం నిశ్చయించింది.

ఈ బృహత్తర కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.2,774 కోట్ల నిధులను కూడా రిలీజ్ చేసింది. దీనిద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న సుమారు 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. అక్టోబర్ నెలలో వివిధ కారణాల వల్ల నవంబర్ పింఛన్(AP Pensioners) అందుకోలేకపోయిన వారికి, ఈ డిసెంబర్ మొత్తంతో కలిపి ఒకేసారి రూ.8,000ల నగదును సచివాలయ సిబ్బంది డైరెక్టుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తారు.

అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) కింద ఉన్న 9.34 లక్షల మంది లబ్ధిదారులకు.. కేంద్ర వాటా సొమ్ము నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోనే జమ అవుతుంది.

మరోవైపు కొత్త పెన్షన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఏపీ ప్రభుత్వం సంతోషకర వార్తను అందించింది. ఏపీ వ్యాప్తంగా అందిన దాదాపు 13 లక్షల కొత్త దరఖాస్తులపై పంచాయతీ ఎలక్షన్ ప్రాసెస్ ముగిసిన వెంటనే, అంటే డిసెంబర్ నెలలోనే విచారణ చేపట్టనున్నారు.

ఏడు దశల అర్హత ప్రమాణాలు (Seven step verification) ప్రాతిపదికన పూర్తిస్థాయిలో లబ్ధిదారులను పారదర్శకంగా సెలక్ట్ చేయనున్నారు. ఈ కండీషన్లకు లోబడి ఎంపికైన అర్హులందరికీ వచ్చే ఏడాది జనవరి నెల నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Adarsha Kutumbam OTT : మరో 5రోజుల్లో ఓటీటీలోకి వెంకీ మామ ఆదర్శ కుటుంబం..ఎక్కడ? ఎప్పుడు?

Related Articles

Back to top button