Arnab Cyclone : తెలుగు రాష్ట్రాలపై అర్నబ్ తుపాను ప్రకోపం..తెలంగాణకు వర్ష గండం..
Arnab Cyclone : అర్నబ్ తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విమానాలు, ఫలక్‌నుమా, గోదావరి వంటి కీలక రైళ్లు కూడా రద్దయ్యాయి.
Arnab Cyclone
ప్రకృతి విరుచుకుపడితే జనజీవనం ఎంతగా స్తంభించిపోతుందో చెప్పడానికి ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్న పరిస్థితులే ప్రత్యక్ష నిదర్శనం. అయితే అర్నబ్ తుపాను(Arnab Cyclone) సృష్టిస్తున్న విధ్వంసం కేవలం కోస్తాంధ్ర తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా, తెలంగాణలో కూడా ప్రభావం చూపిస్తోంది. తుపాన్ తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో.. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ముఖ్యంగా తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారలు సూచించారు. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఈ తుపాను(Arnab Cyclone) సృష్టించిన బీభత్సానికి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేయాలనుకునే వారికి గట్టి షాక్ తగిలింది. ముందు జాగ్రత్త చర్యగా అక్టోబర్ 26 సోమవారం రోజే శంషాబాద్ ఇంటర్నేష్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లాల్సిన కొన్ని ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అయితే ఈ ఎయిర్ ట్రాఫిక్ అంతరాయం ఇంకా రెండు రోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉందని ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
మరోవైపు కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో పడుతున్న అర్నబ్ తుపాను వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా 11 కీలకమైన రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రకటించారు. అందులో రోజూ వేలాదిమంది ప్రయాణించే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, గోదావరి, విశాఖ, గౌతమి, కోకనాడ , నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.
అందుకే ఈ పరిస్థితి సద్దుమణిగేవరకూ ప్రయాణీకులు ఎవరైనా ఇంటి నుంచి బయటకు బయలుదేరే ముందు ఐఆర్సీటీసీ (IRCTC) లేదా ఎన్టీఈఎస్ (NTES) యాప్‌లలో తమ రైలు స్టేటస్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
Instagram : లాంగ్ వీడియోలతో ఇన్ స్టా రీ ఎంట్రీ..యూట్యూబ్ సామ్రాజ్యానికి చెక్ పెట్టగలదా?





