Just Andhra PradeshLatest News

Cyclone Effect : గంటకు 150 కిమీ వేగంతో ప్రచండ గాలులు..రేపు ఉదయం తుపాన్ యానాం సమీపంలో తీరం దాటే అవకాశం..

Cyclone Effect : కోస్తాంధ్ర, యానాం వంటి ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, కొన్ని జిల్లాల్లో భారీ కుంభవృష్టి నమోదు కానుంది. ఈ టైమ్‌లో గంటకు 90 - 110 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.

Cyclone Effect

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ అత్యంత తీవ్ర తుపాను తీరం వైపు వేగంగా దూసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశలో పయనం చేస్తూ తుపాన్ ఉధృతిని మరింత పెంచుకుంటోంది.

మంగళవారం ఉదయానికి విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 220 కి.మీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 240 కి.మీటర్లు, మచిలీపట్నానికి 340 కి.మీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఈ తుపాను(Cyclone Effect) మెల్లగా తన డైరెక్షన్‌ను మార్చుకుని వాయువ్యంగా ప్రయాణించి అక్టోబర్ 28వ తేదీన ఉదయానికి బాపట్ల టు విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అధికారులు అఫీషియల్‌గా స్పష్టం చేశారు.

తీరం దాటే సమయంలో అర్నాబ్ వినాశకర రూపాన్ని దాల్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు . ఆ సమయంలో గంటకు 125 – 135 కి.మీటర్ల వేగంతో, గరిష్టంగా 150 కి.మీటర్ల భయానక వేగంతో భయంకరమైన గాలులు వీచే అవకాశముంది. దీనికి తోడు నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక కోస్ట్‌ నుంచి ఈ సైక్లోన్(Cyclone Effect) కేంద్రం వరకు ద్రోణి విస్తరించి ఉండగా, తమిళనాడు తీరంలోని ఉపరితల ఆవర్తనం కూడా దీనిలో కలిసిపోవడంతో సముద్రమంతా అత్యంత అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రభావంతో తీరప్రాంతాల్లో ఎగసిపడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ తీవ్ర పరిణామాల వల్ల రాగల 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వాతావరణం దారుణంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్ర, యానాం వంటి ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, కొన్ని జిల్లాల్లో భారీ కుంభవృష్టి నమోదు కానుంది. ఈ టైమ్‌లో గంటకు 90 – 110 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు రాయలసీమలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి. ఇక తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉండటంతో రాబోయే మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. వాతావరణ శాఖ హెచ్చరికల వల్ల ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Anirudh – Kavya Maran Wedding Invitation : అనిరుధ్‌, కావ్య మారన్ వెడ్డింగ్ కార్డ్ చూశారా? ట్రెండ్ అవుతున్న ఇన్విటేషన్ కార్డ్..

Related Articles

Back to top button