Just Andhra PradeshJust TelanganaLatest News

Balakrishna : ఏఐజీ హాస్పిటల్‌లో బాలయ్య..హెల్త్ బులెటిన్ విడుదల

Balakrishna : బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Balakrishna

నిన్న ఎన్ బీకే 111 షూటింగ్‌లో గాయపడిన హీరో నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం షూటింగ్ కాకినాడ పోర్టులో జరుగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తుండగా బాలకృష్ణ ప్రమాదవశాత్తూ కాలుజారి పడ్డారు. దీంతో ఎడమ కాలికి గాయమైంది.

దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స తర్వాత బాలయ్యను హైదరాబాద్ తరలించారు. నిన్నటి నుంచి బాలకృష్ణకు ఎలా ఉందంటూ అభిమానులు ఆరా తీస్తూ ఆందోళన చెందుతున్నారు. తాజాగా

బాలయ్య ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏఐజీ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసిన డాక్టర్లు కొన్ని వివరాలు వెల్లడించారు. బాలయ్య ఎడమ కాలి మోకాలి చుట్టూ కణజాలంలో రక్తం గడ్డకట్టి వాపు వచ్చినట్టు గుర్తించారు. ఈ లక్షణాలతో మోకాలి భాగంలో కండరాల చీలిక ఏర్పడే అవకాశముందని చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు ఇతర సర్జన్లతో కూడిన వైద్యబృందం పర్యవేక్షణలో బాలకృష్ణ ఉన్నారని, తర్వాతి చికిత్స కోసం మరికొన్ని పరీక్షలు చేయనున్నట్టు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించారు. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు కొనసాగుతున్నాయనీ, ఇవి పూర్తయ్యాక సర్జరీ వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Balakrishna
Balakrishna

కాగా గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఐదు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.

Mega 158 : పండగ రేస్ కంటే సోలో రిలీజే బెటర్.. చిరు, బాబీ మూవీ ప్లాన్ మారిందా?

Related Articles

Back to top button