Just Andhra PradeshJust PoliticalLatest News

Municipal Election : ఏపీ మున్సిపల్ పోరుకు బ్రేక్.. 100 స్థానిక సంస్థల్లో ఎలక్షన్ ప్రాసెస్ హోల్డ్..

Municipal Election :ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సుప్రీంకోర్టు ఆదేశాలతో భారీ బ్రేక్ పడింది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలలో ఎన్నికలను నిలిపివేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Municipal Election

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల(Municipal Election) వార్‌లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. గంటగంటకూ మారుతున్న రాజకీయ డ్రామా మధ్య, ఊహించని రేంజ్‌లో బ్రేక్ పడింది. ఎన్నికల హీట్ పీక్స్‌లో ఉన్న సమయంలో భారత అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక పోరుకు రాత్రికి రాత్రే గట్టి ఎదురదెబ్బ పడింది.

నామినేషన్ల ఘట్టాన్ని పూర్తి చేసుకొని, ఫైనల్ బరిలో నిలిచే కేండిడేట్స్ జాబితా కోసం వెయిట్ చేస్తున్న టైమ్‌లో ఎలక్షన్ ప్రాసెస్ టోటల్లీ హోల్డ్‌లోకి వెళ్లిపోయింది. ముందు కేవలం కొన్ని వివాదాస్పద స్థానాలకే ఈ బ్రేక్ అనుకున్నా..కోర్టు ఆర్డర్స్ సీరియస్‌నెస్‌ను క్షుణ్ణంగా స్టడీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC).. ఏకంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ ప్రాసెస్‌ను ప్రెజెంట్‌గా పాజ్ మోడ్‌లో పెట్టేస్తూ అఫీషియల్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసింది.

ఈ ఊహించని షాక్‌తో ఆంధ్రప్రదేశ వ్యాప్తంగా ఉన్న 13 భారీ మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే 87 మున్సిపాలిటీలలో ప్రస్తుతం విత్ డ్రావల్స్, కేండిడేట్స్ ఫైనల్ లిస్ట్ ప్రకటనలన్నీ ఆగిపోయాయి. ఈ విత్‌డ్రావల్స్ ప్రాసెస్‌తో పాటు కంటెస్టింగ్ అభ్యర్థుల లిస్ట్‌ను అక్టోబర్ 25 వ తేదీ వరకు పక్కన పెట్టాలని సుప్రీంకోర్టు క్లియర్‌గా ఆర్డర్స్ ఇచ్చింది.

నిజానికి ఇదంతా వైసీపీ నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టడంతోనే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ కేండిడేట్స్‌కు నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారని, తమ అభ్యర్థులకు పూర్తి ప్రొటెక్షన్ ఇస్తూ నామినేషన్ల టైమ్‌ను పెంచాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్ట్.. నామినేషన్లు వేయలేకపోయామని వినతులు, ఆధారాలు సమర్పించిన కేండిడేట్స్ ఫిర్యాదులను కేస్-టు-కేస్ పరిశీలించాలని ఎస్‌ఈసీకి సూచించింది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్ల గడువును పెంచాలని డిసైడ్ అయితే మాత్రం, ఆయా అభ్యర్థులకు కనీసం 48 గంటల అదనపు టైమ్ ఇవ్వాలని కండిషన్ పెట్టింది.

దీంతో దీనిపై స్పందించిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి అనిల్‌చంద్ర పునేఠా .. సుప్రీంకోర్టు లీగల్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతామని, ప్రస్తుతానికి  ఎలక్షన్‌(Municipal Election) ప్రాసెస్‌ను కంప్లీట్‌గా నిలిపివేస్తున్నామని అక్టోబర్ 21 బుధవారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ బాస్‌ల (ఎస్పీలు) నుంచి గ్రౌండ్ లెవెల్ నివేదికలు అందిన తర్వాత, నామినేషన్ల రీ-ఓపెనింగ్ అండ్ ఎక్స్‌టెన్షన్‌పై ఈసీ ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది.

మరోవైపు ఈ సడన్ డెవలప్‌మెంట్స్‌పై అధికార కూటమి నేతలు విపరీతంగా మండిపడుతున్నారు. ఎన్నికలు సజావుగా జరిగిపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 16వ ఆర్థిక సంఘం నిధులతో పాటు డెవలప్‌మెంట్ ఫండ్స్ డైరెక్టుగా వస్తాయని.. కానీ వైసీపీ ఎలా అయినా సరే ఈ మున్సిపల్(Municipal Election) ఎలక్షన్స్‌ను డిస్టర్బ్ చేసి డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటుందని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల హోల్డ్ ఆర్డర్‌తో ఏపీ పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది.

Hormonal Effect : హార్మోన్ల ఎఫెక్ట్ స్త్రీలకు మాత్రమేనా? ..ఏజ్‌తో పాటే ఎమోషనల్ హార్మోన్లు అందరిలోనూ మారతాయని తెలుసా?

Related Articles

Back to top button