Just Andhra PradeshJust PoliticalLatest News

Chandrababu – Pawan Kalyan : ఏపీ పరిషత్ పోరుకు కూటమి ఉమ్మడి వ్యూహం..చంద్రబాబు, పవన్ అర్జెంట్ మీటింగ్

Chandrababu - Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి కాన్వాయ్, అధికారిక హంగులు లేకుండా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆకస్మికంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, స్థానిక పోరులో కూటమి వ్యూహాల పూర్తి వివరాలు చూద్దాం.

Chandrababu – Pawan Kalyan

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ చిన్న పొరపాటు కూడా రాకుండా క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కూటమి పార్టీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాల తర్వాత పరిణామాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Chandrababu – Pawan Kalyan) అత్యవసరంగా భేటీ అయ్యారు.

అయితే ప్రొటోకాల్ ప్రకారం కాన్వాయ్‌, పోలీసు భద్రత ఏమీ లేకుండా అత్యంత సాధారణ వ్యక్తిలా .. డైరెక్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్(Chandrababu – Pawan Kalyan) చేరుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసిన కొద్ది గంటల్లోనే.. డిప్యూటీ సీఎం ఇలా వెళ్లి సీఎం చంద్రబాబును కలవడం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

వీరిద్దరి కీలక భేటీలో మెయిన్‌గా లోకల్ బాడీ ఎన్నికల అజెండానే హైలైట్‌గా నిలిచింది. 19 మున్సిపాలిటీలతో పాటు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రాసెస్‌పై సుప్రీం ఆదేశాల ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోంది, రాబోయే రోజుల్లో ఎస్ఈసీ ఎలాంటి అడుగులు వేయబోతోందనే విషయాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు సమాచారం.

ఏపీ వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి కేండిడేట్స్ మధ్య సీట్ల సర్దుబాటు, అలాగే నామినేషన్ల ప్రాసెస్‌లో ఫాలో అవ్వాల్సిన పక్కా ప్రణాళికలపైన కూడా ఇద్దరు అగ్రనేతలు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్ పోరు సమయంలో నామినేషన్లలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, వైసీపీ ఆడిన నాటకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి అలాంటి తప్పులు జరిగే ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలను ..ఈ ఎన్నికలలో తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేయాలని చూస్తున్న వైసీపీ నేతలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి కూటమి పక్కా స్కెచ్‌తో సిద్ధమైంది. దీంతో రాబోయే 48 గంటల తర్వాత ఎస్‌ఈసీ వెల్లడించే అఫీషియల్ గైడ్‌లైన్స్ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

Pink Basket Dating : డేటింగ్ యాప్స్ ఓల్డ్ అయిపోయాయ్.. పింక్ బాస్కెట్ లవ్ స్టోరీస్ ట్రెండ్ అవుతున్నాయి..

Related Articles

Back to top button