Vijay AP Tour : విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో కీలక భేటీ..
Vijay AP Tour : ముఖ్యమంత్రి విజయ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక సమావేశం కాబోతున్నారు.
Vijay AP Tour
తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌నే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతున్న ఒక ఆసక్తికర పరిణామం త్వరలోనే చోటు చేసుకోనుంది. తమిళనాడు కొత్త సీఎం, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత జోసెఫ్ విజయ్ ఏపీ టూర్‌కు(Vijay AP Tour) రెడీ అవుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈనెల 13న విజయ్ డైరెక్టుగా విజయవాడ సిటీకి రాబోతున్నారు.
ఇంతకు ముందు లేని విధంగా తమిళ హీరో అది కూడా పొరుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్.. ఏపీకి రావడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.దీంతో ప్రశాంతంగా సాగుతున్న కృష్ణా రివర్ వాటర్స్ పంపిణీ వ్యూహాలపై విజయ్ పర్యటన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఈ కీలకమైన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఏపీ , తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా నలుగుతున్న కృష్ణా నదీ జలాల వాటా, వాటర్ రిలీజ్ వంటి అంశాలపై వీరిద్దరి మధ్య లోతైన చర్చలు జరగబోతున్నాయి.
సీఎంతో భేటీ ముగిసిన తర్వాత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కూడా సీఎం విజయ్ సమావేశమయ్యే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవైపు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి రికార్డు విజయం సాధించిన సీఎం విజయ్, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవబోతుండటం ఇటు రాజకీయంగానే కాకుండా అటు రెండు రాష్ట్రాల ఫ్యాన్స్ వర్గాల్లోనూ సెన్సేషన్ వార్తగా చక్కర్లు కొడుతుంది.

పాలనాపరమైన చర్చలు, రాజకీయ భేటీలు పూర్తయిన తర్వాత తమిళనాడు సీఎం విజయ్ ఏపీ3లో(Vijay AP Tour) ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. బెజవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ..విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో విజయ్ పాల్గొననున్నారు.
ఒక వైపు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య సరిహద్దు జలాల సమస్యలపై సీఎం చంద్రబాబుతో సీరియస్ చర్చలు జరుపుతూనే, మరో వైపు కల్చరల్ ఉత్సవాల్లో విజయ్ సందడి చేయనుండటం ఈ పర్యటనకే అసలైన హైలైట్‌గా మారబోతోంది. మొత్తం మీద ఈ నెల 13వ తేదీన బెజవాడ వేదికగా జరగబోయే.. ఈ హై-ప్రొఫైల్ పొలిటికల్ కమ్ కల్చరల్ ఈవెంట్ ఎలాంటి మలుపులకు దారి తీస్తుందో చూడాలి మరి.





