Divorce : విడిపోవాలనుకుంటే 6 నెలలు ఆగక్కరలేదు.. కూలింగ్ పీరియడ్‌పై మరోసారి చర్చ
Divorce : సాధారణంగా ఇలా కోర్టులు ఇచ్చే ఈ 6 నెలల కూలింగ్ పీరియడ్‌లో చాలా మంది దంపతులు తమ తప్పులను తెలుసుకుని, ఆలోచించుకుని మళ్లీ కలిసిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
Divorce
భార్యాభర్తల బంధంలో ఒకరితో ఒకరికి మనస్పర్థలు వచ్చి, కలిసి జీవించడం అసాధ్యమనుకుని డిసైడ్ అయినపుడు విడాకులు(Divorce )తీసుకోవడమే వారికి చివరి మార్గంగా మారుతుంటుంది.
అయితే వారిద్దరూ పరస్పర అంగీకారంతో చట్టప్రకారం విడాకులు తీసుకోవాలన్నా సరే కోర్టు వారికి కొన్ని కండిషన్లు పెడుతుంటుంది. దంపతులు మనసు మార్చుకుని తిరిగి కలుసుకునేవిధంగా ఆలోచించుకోవడానికి కూలింగ్ పీరియడ్ అంటే..వీరిద్దరూ 6 నెలలు వేచి ఉండే సమయాన్ని కోర్టులు ఇస్తుంటాయి.
కానీ, ఈ 6 నెలల సమయం అందరికీ తప్పనిసరి కాదంటూ..ఏపీ హైకోర్టు తాజాగా ఒక విప్లవాత్మక తీర్పును వెలువరించింది. వివాదాలు పూర్తిగా ముదిరిపోయి, ఇద్దరూ రాజీపడే అవకాశం లేనప్పుడు ఈ సమయాన్ని మినహాయించొచ్చని చెప్పింది.
ఒంగోలుకు చెందిన ఒక దంపతుల కేసును విచారిస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.
అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వల్ల కలిగే లాభాలను ముందుగా పరిశీలిస్తే.. ఇది దంపతులకు ఒక పెద్ద మానసిక ఊరట అనే అనాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఆస్తి పంపిణీ, పిల్లల సంరక్షణ, భరణం వంటి అన్ని విషయాలపై ముందే ఒక అవగాహనకు వచ్చి, విడిపోవాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాక కూడా.. కోర్టుల చుట్టూ నెలలకు నెలలు తిరగమనడం వారిని మరింత మానసిక వేదనకు గురిచేయడం కిందే అవుతుంది.
న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వల్ల అలాంటి వారికి సుదీర్ఘ కోర్టు ప్రక్రియ నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది. కాలయాపన తగ్గడం వల్ల దంపతులిద్దరూ తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టి, జీవితంలో త్వరగా ముందుకు సాగడానికి (Move on ) అవడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే కొన్ని కేసుల్లో సాధారణంగా ఇలా కోర్టులు ఇచ్చే ఈ 6 నెలల కూలింగ్ పీరియడ్‌లో చాలా మంది దంపతులు తమ తప్పులను తెలుసుకుని, ఆలోచించుకుని మళ్లీ కలిసిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.తాజాగా కోర్టు ఆవరణలోనే ఇలాంటి ఘటన జరగడం హాట్ టాపిక్‌గా కూడా మారింది.

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బీ(2) ముఖ్య ఉద్దేశం కూడా పెళ్లి బంధాన్ని కాపాడటమే. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని లేకుండా చేయడం వల్ల, చిన్న చిన్న గొడవలకు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కూడా బంధాలు వెంటనే ముక్కలైపోయే ప్రమాదం ఉంటుంది. త్వరగా విడాకులు(Divorce) వచ్చేస్తాయనే ఆలోచనతో దంపతులు సర్దుకుపోయే మైండ్ సెట్‌కు దూరంగా ఉంటారు.
మరోవైపు ఈ తీర్పుపై నిపుణులు కూడా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. వారిద్దరినీ బలవంతంగా ఒకే ఇంట్లో ఉంచుతూ నరకం అనుభవించేలా చేయడం కంటే, గౌరవప్రదంగా విడిపోవడమే ఇద్దరికీ మంచిదని అంటున్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుందని గుర్తు చేస్తున్నారు.
Caste : మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు రావు..ప్రభుత్వ ఉత్తర్వు కొట్టివేసిన హైకోర్టు





