Telangana Congress : సీఎం పీఠం కింద నీళ్లు చేరుతున్నాయా?.. రేవంత్ పవర్స్‌కి ఇంటర్నల్ పాలిటిక్స్ చెక్ పెడుతున్నాయా?
Telangana Congress : రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ వర్గాలు చేస్తున్న వరుస కామెంట్లు చూస్తుంటే కాంగ్రెస్ రూట్‌లో పెద్ద తుపానే రాబోతోందనే చర్చలు ఊపందుకున్నాయి.
Telangana Congress
అధికార పీఠం మీద ఉన్న లీడర్ ప్రజల్లో తిరుగులేని క్రేజ్‌తో ఉన్నంత వరకూ ఎవరూ నోరెత్తే ధైర్యం చేయరు. అపోజిషన్ లీడర్ల విమర్శలను లైట్ తీసుకున్నా కూడా, సొంత పార్టీ నేతలైతే ఆయన మీద ఈగ వాలకుండా చూసుకుంటారు.
కానీ అదే నాయకుడికి జనాదరణలో కాస్త గ్రాఫ్ తగ్గినా లేదా సీట్‌లో షేకింగ్ మొదలైందనే సంకేతాలు వచ్చినా సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. నిన్నటివరకు సైలెంట్‌గా ఉన్నవాళ్లే ఉన్నపళంగా వాయిస్ పెంచుతారు. అధికారం చేతులు మారే సూచనలున్నట్లు చిన్న హింట్ దొరికినా, సొంత గూటి నుంచే పొలిటికల్ అటాక్స్ పెరిగిపోతుంటాయి.
సరిగ్గా ఇప్పుడు ఇదే విధంగా తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లోనూ ఇంటర్నల్ రాజకీయం హీటెక్కిపోతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ వర్గాలు చేస్తున్న వరుస కామెంట్లు చూస్తుంటే కాంగ్రెస్ రూట్‌లో పెద్ద తుపానే రాబోతోందనే చర్చలు ఊపందుకున్నాయి.
రేవంత్ రెడ్డి సీఎంగా పవర్స్ తీసుకున్న కొత్తలో పరిస్థితులు వేరుగా ఉండేవి. కాంగ్రెస్(Telangana Congress)లోని పాత తరం నేతల నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, అధిష్టానం ఆశీస్సులను తన వైపు తిప్పుకోవడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. కేబినెట్ కూర్పు దగ్గర నుంచి ఇతర పార్టీల లీడర్ల చేరికల వరకు హైకమాండ్ చెప్పినట్టే వింటూ, పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు. ఢిల్లీ నుంచి ఫుల్ సపోర్ట్ రావడంతో పాటు ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కూడా తన దారిలోకి తెచ్చుకుని తిరుగులేని అధికారంతో పాలన సాగించారు.
కానీ, గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆ రోజులకు, ఇప్పటికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మారిపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో కాస్త అసంతృప్తి మొదలైందనే ప్రచారం వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల రిజల్ట్‌ను వదిలేస్తే, రాబోయే రోజుల్లో మాత్రం ఈ సీన్ మారొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అప్పుడపుడు మెరుపులు మెరిపిస్తున్నా కూడా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా డల్ అవ్వడం మొదటి దెబ్బ అయితే, సంక్షేమ పథకాల నగదు టైమ్‌కి చేతికి అందకపోవడం సామాన్యులలో అసహనం తెప్పిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ పెట్టిన కేసులు కూడా.. కోర్టుల్లో నిలవకపోవడం రేవంత్ రెడ్డికి పెద్ద మైనస్ అయింది.
వీటిని కవర్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి టెండర్లు, ఐఏఎస్ అధికారులపై యాక్షన్స్, రెవిన్యూ డిపార్ట్మెంట్‌లో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ తన అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 2029 వరకు నేనే సీఎం అని పదే పదే చెబుతున్నా, లోపల మాత్రం సీన్ కంట్రోల్ దాటుతోందనే టాక్ నడుస్తోంది.
తెలుగు సినీ ఇండస్ట్రీ విషయంలోనూ ఒకప్పటి అధికారం ఇప్పుడు కనిపించడం లేదు. మొదట్లో సినిమా టికెట్ల రేట్లు పెంచేదే లేదంటూ హోంమంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరాఖండిగా చెప్పారు. కానీ, అల్లు అర్జున్ వివాదం, నాగార్జున ఆస్తులపై హైడ్రా దండయాత్రలు వంటివి జరిగిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన కంట్రోల్ మొత్తం రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయింది.
కోమటరెడ్డి వెంకట్ రెడ్డి పక్కన పడిపోయారు. తన సొంత శాఖలోనే తనకు ప్రాధాన్యత తగ్గడం, నల్లగొండ జిల్లా రాజకీయాల్లో పొంగులేటి జోక్యాన్ని ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడం వెంకట్ రెడ్డికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వెర్షన్ మరోలా ఉంది. ఆయన మొదటి నుంచి కూడా తిరుగుబాటు బావుటా ఎగరేసే నైజం ఉన్న లీడరే. మంత్రి పదవి ఆశ చూపి తనతో నడిపించినా, తుంగతుర్తి పంచాయితీ వెనుక సీఎం హస్తం ఉందనే అనుమానం రాజగోపాల్ రెడ్డి లో గట్టిగా నాటుకుపోయింది. దీంతో మళ్లీ రేవంత్‌పై ఓపెన్‌గా ఫైర్ అవ్వడం స్టార్ట్ చేసిన రాజగోపాల్ రెడ్డి ..బయటి నుంచి వచ్చిన వాళ్లని నమ్మొద్దని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ డైరెక్టుగా రేవంత్ రెడ్డికే గురిపెట్టినట్లయింది.
మరోవైపు వరంగల్ పొలిటికల్ హీట్ సీఎంకి పెద్ద హెడేక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత.. కాంగ్రెస్ ఇంటర్నల్ వర్గాలతో తలపడటానికి రెడీ అయింది. గతంలో తన ఓఎస్‌డీ పంచాయితీలో పోలీసులకే సవాల్ విసిరిన కొండా సుస్మిత, తాజాగా పార్కల్ నియోజకవర్గం నుంచి మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం ప్రకటించడంపై ఫైర్ అయింది.

అసలు అభ్యర్థులను ప్రకటించడానికి నువ్వెవరని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే నిలదీసే స్థాయికి వెళ్లిపోయింది. ఈ కామెంట్లు వచ్చిన వెంటనే సుస్మిత పాత ఓఎస్‌డీపై పోలీసులు కేసు ఫైల్ చేయడం, దీనిపై పీసీసీ కొండా సురేఖను వివరణ కోరడం స్పీడ్‌గానే జరిగిపోయాయి. అయితే కూతురు చెప్పిన మాటలకు తనకు సంబంధం లేదని సురేఖ చెప్పడం, అమ్మానాన్న మాటలను వినాల్సిన అవసరం తనకు లేదని సుస్మిత అనడం.. కొండా ఫ్యామిలీ సీఎంపై పూర్తిస్థాయి వార్‌కి రెడీ అయిందని చెప్పకనే చెబుతోంది.
ఒకరి తర్వాత ఒకరు సొంత పార్టీ నేతలే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పవర్‌ను ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ మార్క్ నైజం ప్రకారం చూస్తే కనుక అవకాశం వస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని లాగేయడానికి రెడీగా ఉన్న సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు.
మరి రాబోయే రోజుల్లో ఈ సొంతకుంపటిలో తిరుగుబాటు ఎంతదూరం వెళ్తుంది? ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని కాపాడుకుంటుందా లేక ప్రత్యామ్నాయం వైపు చూస్తుందా అనే విషయాలు తెలంగాణ రాజకీయంలో హీటును పుట్టిస్తున్నాయి.
AP Alliance : కూటమిలో సైలెంట్ సునామీ?..లోకేష్ ఆధిపత్యం, పవన్ ఈగోతో కూటమికి పెద్ద షాక్ తప్పదా?





