Just Andhra PradeshJust PoliticalLatest News

TDP Suspends : కూటమి ధర్మం ఉల్లంఘిస్తే ఉపేక్షించేదే లేదు.. టీడీపీలో తిరుగుబాటుదారులపై వేటు..

TDP Suspends : విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ధిక్కరించి రెబల్స్‌గా బరిలోకి దిగిన ఏడుమందిని టీడీపీ సస్పెండ్ చేసింది. కూటమి ధర్మం, సస్పెండైన నాయకుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

TDP Suspends

స్థానిక సంస్థల ఎన్నికల హీట్ ఏ రేంజ్‌లో ఉందో విజయవాడ పాలిటిక్స్ చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది.ఎలక్షన్స్‌లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న అధికార టీడీపీ..తమ పార్టీలో క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. కూటమిలో పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తూ, అధికారిక కేండిడేట్స్‌కు వ్యతిరేకంగా రెబల్స్‌గా బరిలోకి దిగిన ఏడుగురు కీలక నేతలను..టీడీపీ నుంచి సస్పెండ్(TDP Suspends) చేస్తూ అధిష్ఠానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై ఈ నేతలకు తెలుగు దేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేదని అధిష్టానం స్పష్టం చేయడంతో స్థానిక రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి.

పొత్తు ధర్మానికి విలువ ఇస్తూ టీడీపీ , జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీనిలో భాగంగానే విజయవాడ కార్పొరేషన్‌లోని కొన్ని కీలక డివిజన్లను మిత్రపక్షాలయిన జనసేన , బీజేపీకి కేటాయించారు. అయితే దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేశామన్న భావంతో కొంతమంది నేతలు ఈ టికెట్ ఆశించి భంగపడ్డారు. అధిష్ఠానం నిర్ణయాన్నికూడా లెక్కచేయకుండా స్వతంత్రులుగా, రెబల్స్‌గా నామినేషన్లు వేసి ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. పార్టీ ఎంతగా వారించినా కూడా వెనక్కి తగ్గకుండా ప్రచారంలో దూసుకెళ్లడంతో అధిష్ఠానం సీరియస్‌గా స్పందించింది.

ముఖ్యంగా 69వ డివిజన్‌ను కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించడంతో.. అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన కాకొల్లు మహేంద్రనాథ్ (బాబీ) విభేదించారు. ఆయనతో పాటు మరో డివిజన్‌లో గుడిపాటి సౌజన్యకు అఫీషియల్‌గా టికెట్ కేటాయించినా కూడా, కొమ్మినేని సురేశ్‌, మాదాల సత్యవతి వంటి వారు ఇండిపెండెంట్లుగా పోటీకి దిగారు.

అంతేకాకుండా రెబల్ కేండిడేట్‌కు మహేంద్రనాథ్‌కు తెరవెనుక మద్దతు ఇస్తున్న దేవరపు మాల్యాద్రి, గెడ్డం శ్రీనివాసరావు, కోట నారాయణ, చంద్రశేఖర్‌పై కూడా టీడీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కూటమి విజయమే ధ్యేయంగా పనిచేస్తున్న సమయంలో ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు ముందు ముందు ఇంకా పెరగకముందే అణచివేయాలని టీడీపీ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం(TDP Suspends) ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

Arnab Cyclone : అక్టోబర్ 26న ఆర్నాబ్ తుపాను ఉగ్రరూపం..ఉత్తరాంధ్ర, ఒడిశాకు ఐఎండీ హెచ్చరికలు

Related Articles

Back to top button