Visakhapatnam Airport : వైజాగ్ ఎయిర్పోర్ట్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..ఉత్తరాంధ్ర వైమానిక ప్రగతి చరిత్రేంటి?
Visakhapatnam Airport : ఆగస్ట్ 17 అర్ధరాత్రి నుంచి రాబోయే 30 ఏళ్ల పాటు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి సాధారణ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్ రాకపోకలను నిలిపివేస్తుంది.
Visakhapatnam Airport
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, లోకల్ డెవలప్మెంట్కి కొత్త రెక్కలు తొడగడానికి.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భోగాపురంలో అత్యాధునిక సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా రెడీ అయిపోయింది.
విజయనగరం జిల్లాలో అటు అమరావతికి ఇటు విశాఖపట్నంకు దగ్గరలో రెడీ అయిన ఈ భారీ ప్రాజెక్టును.. ఆగస్ట్ 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ఆగస్ట్ 17వ తేదీ అర్ధరాత్రి 00:01 గంటల నుంచి ఇక్కడి నుంచే పూర్తిస్థాయిలో కమర్షియల్ ఫ్లైట్స్ రాకపోకలు స్టార్ట్ కానున్నాయి.
కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో, ఇప్పటి వరకూ సేవలందిస్తున్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ సంచలన ప్రకటన చేసింది. ఆగస్ట్ 17 అర్ధరాత్రి నుంచి రాబోయే 30 ఏళ్ల పాటు వైజాగ్ ఎయిర్పోర్ట్(Visakhapatnam Airport) నుంచి సాధారణ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్ రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎనౌన్స్ చేసింది.
దీంతో ఇప్పటివరకు వైజాగ్ ఎయిర్‌పోర్టుకు ఉన్న ఇంటర్నేషనల్ కోడ్ వీటీజెడ్ (VTZ) కూడా భోగాపురానికి ట్రాన్స్ఫర్ కాబోతుంది. ఈ సందర్భంగా వైజాగ్ ఎయిర్పోర్ట్(Visakhapatnam Airport) చరిత్ర గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
విశాఖపట్నం విమానాశ్రయం దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 350 ఎకరాలలో 170 ఎకరాలు నేవీకి, 180 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కి చెందినవిగా రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ డేగ (INS Dega) నావల్ ఎయిర్ స్టేషన్ ఆధీనంలో, వారి డిఫెన్స్ కంట్రోల్లో పనిచేస్తుంది.
విశాఖపట్నంలో 1931 ప్రాంతంలో తొలి రన్‌వే ఏర్పాటు అయింది. రెండో ప్రపంచ యుద్ధం అంటే 1939–1945 సమయంలో ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను విస్తరించి సైనిక అవసరాలకు వినియోగించారు.
తర్వాత భారత నౌకాదళం 1991లో దీనిని పూర్తిస్థాయి నౌకాదళ వైమానిక స్థావరంగా కమిషన్ చేసి ఐఎన్ఎస్ డే (INS Dega) గా నామకరణం చేసింది. సివిల్ ఏవియేషన్ కోసం ఈ మిలిటరీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఒక సివిల్ ఎంక్లేవ్ కేటాయించారు.
అయితే రక్షణ శాఖ ఆధీనంలో ఉండటం వల్ల నైట్ టైమ్‌లో విమానాల ల్యాండింగ్, రన్‌వే లిమిట్స్ అండ్ కంటిన్యూ ఆపరేషన్లకు కొన్ని అడ్డంకులు ఉండేవి. ఈ భద్రతా పరమైన పరిమితులను అధిగమించి, కమర్షియల్ ఎక్స్‌పోర్ట్స్‌కు అపరిమిత అవకాశాలు కల్పించడానికే భోగాపురం వద్ద సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించారు.
కమర్షియల్ విమానాలు బంద్ అయినా సరే, విశాఖ ఎయిర్పోర్ట్ నావికాదళానికి, భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, వీఐపీ , నాన్-షెడ్యూల్డ్ విమాన సర్వీసులకు కంటిన్యూగా అందుబాటులో ఉంటుంది.
మరోవైపు జీఎంఆర్ సంస్థ పీపీపీ విధానంలో దాదాపు రూ. 4,750 కోట్ల ఖర్చుతో, ఏకంగా 2,203 ఎకరాల భారీ విస్తీర్ణంలో భోగాపురం ఎయిర్‌పోర్టును లేటెస్ట్ టెక్నాలజీతో అత్యాధునిక ఫెసిలిటీలతో అత్యద్భుతంగా నిర్మించింది.
దీనికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్‌గా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మన్యం వీరుడి పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ కాంపౌండ్‌లో అల్లూరి ప్రత్యేక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

బంగాళాఖాతం తీర అందాలను తలపించేలా ఫ్లయింగ్ ఫిష్‌లా డిజైన్ చేసిన ఈ టెర్మినల్‌లో ఏపీ సాంప్రదాయ కళలన్నిటినీ ప్రతిబింబించారు. భారీ బోయింగ్ ఫ్లైట్స్ దిగేలా 3,800 మీటర్ల రన్‌వేతో పాటు 25,000 టన్నుల సరకు ట్రాన్స్పోర్ట్ కెపాసిటీతో కార్గో టెర్మినల్‌ను రెడీ చేశారు.
అంతేకాకుండా ప్రయాణికులకు తక్కువ ధరకే ఆహారం అందించడానికి..ఉడాన్ యాత్రి కేఫ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఫస్ట్ స్టేజ్‌లో ఏటా 60 లక్షల మంది కెపాసిటీతో స్టార్ట్ అయి.. థర్డ్ స్టేజ్ నాటికి 1.8 కోట్ల మందికి సేవలందించేలా ప్రణాళికలు రూపొందించారు.
Date Of Birth : ఈ నెంబర్ వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం..ఈ నెంబర్ వారికి ఆస్తి తగాదాలు సమసిపోతాయి..





