Elon Musk : మస్క్ @ 95 లక్షల కోట్లు..ట్రిలియనీర్ రికార్డు ఖాయమే
Elon Musk : ప్రపంచంలోనే ధనవంతుడిగా ఉన్న మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లా కంపెనీ షేర్ల రూపంలో ఉంది.
Elon Musk
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. సంపదలో ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డుకు చేరువయ్యారు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా నిలిచేందుకు కొద్ది దూరంలోనే ఉన్నారు. ప్రస్తుతం మస్క్(Elon Musk )సంపద 95 లక్షల కోట్లకు చేరింది. త్వరలోనే ఇది 100 లక్షల కోట్లకు అంటే కోటి కోట్లకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మస్క్ ప్రధాన సంస్థ స్పేస్ ఎక్స్ త్వరలోనే ఐపీవోకు రాబోతుంది.
దాని ద్వారా ఆయన సంపదకు మరో 841 బిలియన్ డాలర్లు కలుస్తాయి. అప్పుడు మస్క్ నికర సంపద 1 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుంది. అదే జరిగితే ఒక ట్రిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ధనవంతుడిగా ఉన్న మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లా కంపెనీ షేర్ల రూపంలో ఉంది.
ఇప్పుడు 95 లక్షల కోట్ల రూపాయలు కూడా బ్యాంకులో ఉన్న నగదు కాదు.. వివిధ కంపెనీల్లో మస్క్‌కు(Elon Musk ) ఉన్న వాటాలను మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఈ లెక్క తేలింది. మస్క్ కోటి కోట్లకు చేరువలో ఉన్న నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంపద మొత్తం ప్రపంచంలోనే చాలా దేశాల వార్షిక ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉంది. ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్, తైవాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల జీడీపీ కంటే మస్క్ సంపదే అత్యధికం.
కాగా ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఒరాకిల్ ఫౌండర్ ఎల్లిసన్, గూగుల్ కో ఫౌండర్లు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ సంపద అంతా కలిపితే ట్రిలియన్ డాలర్లు దాటింది. ఎలాన్ మస్క్( ఒక్కడి సంపదే ఇప్పుడు ట్రిలియన్ డాలర్లకు చేరువైంది.
ప్రపంచంలోని ఖరీదైన స్పోర్ట్స్ టీమ్స్ మొత్తం విలువ 353 బిలియన్ డాలర్లుగా ఉంటే మస్క్ తన సంపదలోని కొద్ది మొత్తంతో వాటన్నింటినీ కొనేయగలరు.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మస్క్ కు ప్రస్తుతం ఉన్న 95 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఖర్ఛు చేయాలంటే వందేళ్లకు పైగానే పడుతుంది. గంటకు 9.5 కోట్ల చొప్పున 24 గంటలూ ఖర్చు చేస్తే వందేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. స్పేస్ ఎక్స్ కంపెనీ జూన్ 12న స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మస్క్ పై ఉన్న అంచనాలకు అనుగుణంగా చూస్తే ఈ ఐపీవో ద్వారా చాలా సులభంగానే ఆయన సంపద ట్రిలియన్ డాలర్లు దాటిపోనుంది.
War Updates : పశ్చిమాసియాలో ముగిసిన ప్రశాంతత.. ఏ క్షణంలోనైనా యుద్ధం..





