Gold Price : గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..4 రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
Gold Price : నవంబర్ 16 నాటి బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ, ముంబైలో 24 క్యారెట్లు , 22 క్యారెట్ల పసిడి రేట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంపై వివరాలు..
Gold Price
గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది నిజంగా మంచి ఛాన్స్ అనే చెప్పాలి. కొద్ది రోజులుగా దిగొస్తున్న పసిడి , వెండి ధరలు,ఈరోజు అంటే నవంబర్ 16వ తేదీన కూడా అదే పతన బాట పట్టాయి. వరుసగా నాలుగైదు రోజులుగా బులియన్ మార్కెట్లో ధరలు మెల్లగా తగ్గుతుండటంతో పసిడి కొనేవారికి పెద్ద ఊరట లభించినట్లయింది. మెయిన్‌గా గ్లోబల్ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మన దేశీయ రేట్లపై డైరెక్టుగా ఎఫెక్ట్ చూపుతున్నాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ ధరలను పరిశీలిస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1లక్ష37వేల610 వద్ద కొనసాగుతుండగా, అదే 10 గ్రాముల 22 క్యారెట్ల జ్యువెలరీ గోల్డ్ ధర రూ.1లక్ష26వేల140 వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1లక్ష37వేల760గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1లక్ష26వేల290 వద్ద ట్రేడవుతోంది.
ముంబైలో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రేట్లే కొనసాగుతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1లక్ష37వేల610 , 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.1లక్ష26వేల140 గా స్థిరపడ్డాయి. మరోవైపు సిల్వర్ కూడా పసిడి బాటలోనే నడుస్తూ రికార్డు స్థాయిలో పతనమైంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.1లక్ష94వేల900 వద్ద ట్రేడ్ అవుతోంది.
అసలు ఈ పుత్తడి రేట్లు తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటని విశ్లేషిస్తే..గ్లోబల్ మార్కెట్లో ఫ్యూయల్ ధరలు మెల్లగా తగ్గడం , అమెరికన్ డాలర్ విలువ సాపేక్షంగా స్థిరంగా ఉండటమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ సిచ్యువేషన్‌ను దేశీయ బులియన్ మార్కెట్‌కు బాగా కలిసొచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో పుత్తడి రేట్లు(Gold Price) తగ్గడం వల్ల దీపావళి పండుగ సీజన్ నుంచే గోల్డ్ జ్యువెలరీ కొనుగోళ్లు పెరిగాయని, ఇది మార్కెట్‌కు కొత్త జోష్‌ను ఇచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో డాలర్ కదలికలు, గ్లోబల్ ఎకానమీని బేస్ చేసుకుని ఈ బంగారం, వెండి ధరల్లో మరింత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది.
Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?





