Just BusinessLatest News

Gold Prices :వరుసగా తగ్గుతున్న గోల్డ్ ధరలు.. నాలుగు రోజుల్లోనే దిగొచ్చిన పుత్తడి ధర

Gold Prices : పది రోజుల క్రితం ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు వారం రోజులుగా మెల్లగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.

Gold Prices

గోల్డ్ కొనాలనుకునే సామాన్యులకు, వినియోగదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుసగా రెండో రోజు కూడా ఊరటనిచ్చింది. పది రోజుల క్రితం ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు(Gold Prices ), వారం రోజులుగా మెల్లగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.

ఈ నాలుగు రోజుల్లోనే తులం పసిడి ధరపై రెండు వేల రూపాయలకు పైగా తగ్గింది. తాజాగా మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ ధర 1లక్ష 56 వేల రూపాయల మార్కు వద్దే కొనసాగుతోంది. అలాగే కిలో వెండి ధర కూడా 2 లక్షల 90 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని హైదరాబాద్, విజయవాడతో పాటు విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 1లక్ష56వేల210 వద్ద రికార్డవ్వగా, జ్యువెలరీ తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 1లక్ష43వేల190 వద్ద కొనసాగుతోంది.

ఇవే బంగారం ధరలు(Gold Prices ) దేశంలోని మెజారిటీ మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ ప్రాంతాలలో కూడా కనిపిస్తోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1లక్ష56వేల210 గా, 22 క్యారెట్ల రేట్ రూ. 1లక్ష43వేల190 గానే స్థిరంగా ఉంది.

 

Gold Prices
Gold Prices

అయితే దేశ రాజధాని ఢిల్లీ , దక్షిణ భారతదేశంలోని చెన్నైలలో మాత్రం ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1లక్ష56వేల360 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష43వేల340 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక చెన్నైలో మిగిలిన ప్రాంతాల కంటే రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 1లక్ష60వేల 090 కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష47వేల490 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ పరిస్థితులను బట్టి రోజులో ఈ ధరలు పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా అలాగే ఉండొచ్చు. వీటన్నింటితో పాటు మీరు కొనే జ్యువెలరీపై హాల్‌మార్క్ (Hallmark) ముద్ర ఉందో లేదో కచ్చితంగా పరిశీలించాలి.

pulses :పప్పులు, బియ్యానికి పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న చిట్కా పాటించండి..

Related Articles

Back to top button