Just BusinessLatest News

Gold Prices : బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజే పెరిగిన రేట్లు

Gold Prices : కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తుండటంతో ఊపిరి పీల్చుకున్న సామాన్యులకు..ఈరోజు అంటే మే 6 నాటి రేట్లు పెద్ద షాక్ ఇచ్చాయి

Gold Prices

కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తుండటంతో ఊపిరి పీల్చుకున్న సామాన్యులకు..ఈరోజు అంటే మే 6 నాటి రేట్లు పెద్ద షాక్ ఇచ్చాయి. వరుస తగ్గుదలకు బ్రేక్ పడి ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయంగా ఇరాన్ , అమెరికా మధ్య నెలకొన్న వార్ వాతావరణం, తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వల్ల కూడా గోల్డ్ ధరలు ఈ స్థాయిలో పుంజుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ హఠాత్తు పెరుగుదల కొనుగోలుదారులకు మింగుడుపడని విషయంగా మారింది.

హైదరాబాద్లో ధరల పెరుగుదలను పరిశీలిస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర మంగళవారం రూ.1,49,180 వద్ద ఉండగా, బుధవారం రోజుకు రూ.2,130 పెరిగి రూ.1,51,310కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల పసిడిపై కూడా రూ.1,950 మేర పెరుగుదల నమోదై ప్రస్తుతం రూ.1,38,700 వద్ద కొనసాగుతోంది.

ఇదే ధరలు విజయవాడ , విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. అక్కడ 24 క్యారెట్ల పసిడిపై రూ.2,510 పెరిగి రూ.1లక్ష53వేల280 వద్ద ఉండగా, 22 క్యారెట్ల పుత్తడిపై రూ.2,300 పెరిగి రూ.1,40,500కి చేరింది.

Gold Prices
Gold Prices

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,210 పెరిగి రూ.1లక్ష51వేల440 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1లక్ష38వేల 850 వద్ద ఉంది. బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అక్కడ 24 క్యారెట్లు రూ.1లక్ష51వేల310 గాను, 22 క్యారెట్లు రూ.1లక్ష38వేల700 గా నమోదయ్యాయి.

బంగారంతో పోటీగా సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.5,000 పెరగడంతో ప్రస్తుతం అది రూ.2లక్షల70 వేల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో సిల్వర్ ధరల పెరుగుదల మరింత ఆశ్చర్యకరంగా ఉంది. కేజీ వెండిపై ఏకంగా రూ.10,000 పెరిగి ప్రస్తుతం రూ.2.65 లక్షల వద్ద స్థిరపడింది.

Oscar : ఆస్కార్ అకాడమీ నిబంధనల్లో చారిత్రాత్మక మార్పులు.. భారత్‌కు డబుల్ ధమాకా..

Related Articles

Back to top button