Just BusinessJust NationalLatest News

Gold Price : వారంలో రూ. 7 వేలు వరకూ పడిపోయిన గోల్డ్ ధర.. ఈరోజు ఎంత కాస్ట్ ఉంది?

Gold Price : కేవలం ఈ నాలుగు రోజుల్లోనే తులం పసిడిపై ఏకంగా రూ. 4,000కు పైగా డిస్కౌంట్ దొరికినట్లయింది.

Gold Price

ఇటీవల వరుసగా దూసుకెళ్తున్న గోల్డ్, సిల్వర్ గ్రాఫ్‌లు వారం రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం రోజు బంగారం, వెండి రేట్లు మరోసారి కుప్పకూలడంతో మార్కెట్ ఒక్కసారిగా షేక్ అయింది.

నాలుగైదు రోజుల క్రితం నుంచి మెల్లగా తగ్గుతున్న పుత్తడి ధరలు.. నిన్న ఒక్క రోజే తులం పసిడిపై(Gold Price) ఏకంగా రూ. 2,500కి పైగా పడిపోయాయి. మంగళవారం రోజు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ.. 10 గ్రాములపై మరో రూ. 1,370 వరకూ తగ్గింది. అంటే కేవలం ఈ నాలుగు రోజుల్లోనే తులం పసిడిపై ఏకంగా రూ. 4,000కు పైగా డిస్కౌంట్ దొరికినట్లయింది. ఇక వన్ వీక్ లెక్క చూసుకుంటే ఏకంగా రూ. 6,000 నుంచి రూ. 7,000 వరకు తగ్గడం గోల్డ్ లవర్స్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి.

ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర(Gold Price) రూ. 1లక్ష48వేల800 వద్దకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1లక్ష36వేల400 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 1లక్ష48వేల950 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష36వేల550 వద్ద ఉంది. ఇక ముంబైలో చూస్తే తెలుగు రాష్ట్రాల లాగానే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కాస్ట్ రూ. 1లక్ష48వేల800 గాను, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష36వేల400 వద్ద కొనసాగుతోంది.

వెండి కూడా పుత్తడి మార్గంలోనే పయనిస్తూ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే మన తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు చెన్నై నగరాల్లో మాత్రం కిలో వెండి రేటు రూ. 2,44,900 వద్ద ఉంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,40,000 వద్దే నిలకడగా కొనసాగుతోంది.

Gold Price
Gold Price

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ ఊహించని స్థాయిలో బలపడటం, అమెరికాలో సుమారు మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుండటంతో గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అంతర్జాతీయంగా కమోడిటీ ఎక్స్ఛేంజ్ (COMEX) మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఏకంగా 5 శాతం వరకు క్రాష్ అయ్యాయి. ప్రస్తుతం కామెక్స్‌లో ఔన్సు గోల్డ్ ధర 0.01 శాతం స్వల్ప తగ్గింపుతో $4,168 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్సుకు 1.10 శాతం పడిపోయి $61 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఏది ఏమైనా ఈ విధంగా ధరలు తగ్గడం వల్ల కస్టమర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రాబోయే రోజుల్లో ఈ రేట్లు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఇది గోల్డ్ జ్యువెలరీ కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయంగానే కనిపిస్తోంది.

Cut Off vs Space In Relationship : బంధాల్లో కట్ ఆఫ్ వర్సెస్ స్పేస్.. బంధాలలో బౌండరీలు దాటితే ఏమవుతుంది?

Related Articles

Back to top button