Just EntertainmentLatest News

Aadarsha Kutumbam Review : ఆదర్శ కుటుంబం ప్రివ్యూ రిపోర్ట్..వెంకీ,త్రివిక్రమ్ కాంబో అదిరిందా లేదా?

Aadarsha Kutumbam Review : వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఆదర్శ కుటుంబం' హౌజ్ నెంబర్ 47 మూవీ టాక్ ఎలా ఉంది? కంటెంట్, కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా వర్కవుట్ అయ్యాయా లేదా ?

Aadarsha Kutumbam Review

దీపావళి పండుగ వాతావరణాన్ని ఇంకాస్త ముందుగానే థియేటర్లలోకి తీసుకొస్తూ విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం ఈరోజు ఉదయాన్నే బాక్సాఫీస్ వద్ద దిగింది. సెన్సార్ బోర్డు నుంచి 2 హవర్స్ 23 మినిట్స్ రన్ టైమ్‌తో యూ/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ మూవీపై ఫస్ట్ నుంచి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

20 ఏళ్లు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ జోడీ స్క్రీన్‌పై కనిపించడంతో ఇద్దరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా చాలా చోట్ల ప్రీమియర్స్ ముగియడంతో మూవీ టాక్ ఏంటో బయటకు వచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఇన్సైడ్ టాక్ ప్రకారం చూస్తే.. త్రివిక్రమ్ ఎంచుకున్న మెయిన్ లైన్ పాయింట్ అయితే అదిరిపోయింది. ఫస్టాఫ్‌ను సరదా సంభాషణలు, సత్య కామెడీ సీన్లతో చాలా ప్లెజెంట్‌గా నడిపించేశారు.

వెంకటేష్ ఎప్పటిలాగే తన మార్క్ టైమింగ్‌తో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అలాగే క్లైమాక్స్ సీన్స్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్‌గా నిలిచాయని టాక్ వస్తోంది.

అయితే నార్మల్ మూవీ లవర్స్‌కు మాత్రం ఈ కథనం కాస్త ఫ్లాట్‌గా అనిపించిందని.. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో రొటీన్ ఫార్ములా ఎక్కువగా కనిపించిందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్ పరంగా తమన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయినా కూడా థియేటర్లలో వెంకీ మామ ఇచ్చే నవ్వుల మ్యాజిక్ ట్రీట్ కోసమైనా ఈ మూవీకి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్లొచ్చని టాక్ నడుస్తోంది.


Healthy Relationship : చిన్న విషయానికే కొట్టుకునే స్థాయికి వెళ్తున్నారా?రిలేషన్‌షిప్‌ను కాపాడుకునే సింపుల్ సైకాలజీ టిప్స్

Related Articles

Back to top button