Agnipariksha Season 2 : అగ్నిపరీక్ష 2 స్టార్ట్.. వైరల్ అవుతున్న లీక్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..
Agnipariksha Season 2 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 ఊహించని విధంగా సక్సెస్ అవ్వడంతో.. ఇప్పుడు అగ్నిపరీక్ష సీజన్ 2తో రచ్చ చేయడానికి గేమ్ స్టార్ట్ చేశారు.
Agnipariksha Season 2
తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ మాస్ హంగామా మళ్లీ మొదలైపోయింది. మరి కొద్ది రోజుల్లోనే గ్రాండ్‌గా పదో సీజన్ మెగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. అయితే బిగ్ బాస్ మెయిన్ సీజన్ తలుపులు తెరుచుకోవడానికంటే ముందే, ఆడియన్స్ కోసం బిగ్‌బాస్ అగ్నిపరీక్షతో మరో అదిరిపోయే డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యారు.
తొలి సీజన్ ఊహించని విధంగా సక్సెస్ అవ్వడంతో.. ఇప్పుడు అగ్నిపరీక్ష సీజన్ 2(Agnipariksha Season 2)తో రచ్చ చేయడానికి గేమ్ స్టార్ట్ చేశారు. సీజన్ 9 విన్నర్ అయిన కళ్యాణ్ పడాలతో ప్రసార తేదీలను అనౌన్స్ చేయించిన బిగ్ బాస్ టీమ్, తాజాగా ఒక ప్రోమోను వదిలి క్యూరియాసిటీని పీక్స్‌కి తీసుకెళ్లిపోయింది.
సాధారణంగా బిగ్‌బాస్ అంటే బుల్లితెర నటులు, సెలబ్రిటీలు మాత్రమే కనిపిస్తుంటారు. కానీ రెండు,మూడు సీజన్లుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక తొమ్మిదో సీజన్లో అయితే ఒకడుగు ముందుకేసి సామాన్యులకు అవకాశం కల్పించడం, వాళ్లు కూడా తమ ట్యాలెంట్‌తో ఏకంగా టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించడం చూశాం.
అంతేకాదు అగ్నిపరీక్ష సీజన్ 1కి వచ్చిన క్రేజ్‌ను చూశాక, సీజన్ 2 కోసం ఆడిషన్లు ఆహ్వానిస్తే వేలాది దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వచ్చిన వేల అప్లికేషన్లను వడపోసిన మేకర్స్, ఫైనల్‌గా 70 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. అయితే ఈ 70 మందికి రకరకాల టాస్కులు పెట్టి వారిలో టాప్ 15 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ 15 మంది మధ్య జరిగే పోటీలో గెలిచిన టాప్ 5 లక్కీ విన్నర్స్ డైరెక్టుగా బిగ్‌బాస్ సీజన్ 10 హౌస్‌లోకి అడుగుపెడతారు.
ఇక ఈ షో ఆగస్ట్ 15వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో అగ్నిపరీక్ష 2 స్ట్రీమింగ్ కాబోతోందని ఇప్పటికే సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలతో అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. గత సీజన్ లాగానే ఎనర్జెటిక్ యాంకర్ శ్రీముఖి ఈ షోను హోస్ట్ చేస్తుండగా.. బిగ్‌బాస్ స్టార్స్ అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రోమోలో ఈ ముగ్గురు కంటెస్టెంట్లతో ఫుల్ జోష్‌తో జనరేట్ చేస్తూ, కొన్ని చోట్ల రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తూ గట్టిగానే వార్నింగ్స్ ఇచ్చారు.

అగ్నిపరీక్ష సీజన్ 2 షూటింగ్ ఇప్పటికే హాఫ్ పూర్తయిందని, ఆ 70 మందిలో నుంచి ఫైనల్‌గా సెలెక్ట్ అయిన టాప్ 15 కంటెస్టెంట్ల లీక్డ్ లిస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ లిస్ట్‌లో యాంకర్ ప్రియా, హేమంత్, మిథిలేష్, రోహిత్, సింగర్ ఝాన్సీ,రాజ్ కుమారీ డయానా, షాలినీ పటేల్,భాగీ తుళ్లూరి, అమన్ మసూద్,శ్రిష్టి వ్యాకరణి, గాయత్రి, ఆర్జే చరణ్, సేనపతి దీపర్, మిస్ అపూర్వ, నవరసాలు మావ (RK) ఉన్నట్లు న్యూస్ చక్కెర్లు కొడుతుంది.
Chardham Yatra : హిమాలయాల్లో సరికొత్త హిస్టరీ.. సరికొత్త రికార్డులతో కొనసాగుతున్న చార్ధామ్ యాత్ర





