Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss 10 Telugu Day 23 : బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ల ఫైర్..భైరవ టీమ్ విక్టరీ.. సప్త శక్తి మోతాదు మించిన గొడవలు

Bigg Boss 10 Telugu Day 23 : రథం టాస్క్ రౌండ్లలో బార్లు కలెక్ట్ చేసే ఫస్ట్ రౌండ్‌లో భైరవ టీమ్ 32 బార్లు సాధించగా, సప్త శక్తి జట్టు మాత్రం కేవలం 19 బార్లతో వెనకబడింది.

Bigg Boss 10 Telugu Day 23

బిగ్ బాస్ (Bigg Boss 10 Telugu Day 23)హౌస్‌లో రానురాను ఫ్రెండ్‌షిప్‌లు మాయమైపోయి, కంటెస్టెంట్ల అసలు రంగులు బయటపడుతున్నాయి. రథం టాస్క్‌‌లో స్టార్ట్ అయిన చిన్న నిప్పు రవ్వ, ఆ తర్వాత నామినేషన్ల దగ్గరకు వచ్చేసరికి మరింత భగ్గుమంది. ముందుగా రథం టాస్క్ రౌండ్లలోకి వెళ్తే.. బార్లు కలెక్ట్ చేసే ఫస్ట్ రౌండ్‌లో భైరవ టీమ్ 32 బార్లు సాధించగా, సప్త శక్తి జట్టు మాత్రం కేవలం 19 బార్లతో వెనకబడింది.

ముందు రోజు షాలిని చేసిన ఓవర్ యాక్షన్‌కి, అపూర్వతో పెద్ద గొడవే జరిగింది. మొదటి రౌండ్ విజయంలో వంశీ కీ రోల్ పోషించాడని బిగ్ బాస్ ముందే భైరవ టీమ్ పొగిడింది. ఇక రెండో రౌండ్‌కి సృష్టి, అమన్‌ సంచాలకులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ రౌండ్‌లో కూడా రెండు టీమ్‌లు ఫిజికల్‌గా ఒకరిని ఒకర నెట్టుకుంటూ, బార్లు లాక్కుంటూ తెగ రచ్చ చేశాయి. ఈ గేమ్‌లో టెన్షన్ తట్టుకోలేక ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం.

రెండో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి భైరవ టీమ్ దగ్గర 51 బార్లు, సప్త శక్తి టీమ్ వద్ద 20 బార్లు మిగిలాయి. దీంతో విన్నర్‌గా నిలిచిన భైరవ టీమ్‌కు రథాన్ని అమర్చే గోల్డెన్ అవకాశం దక్కింది. ఈ రౌండ్ విజయానికి సుధీర్ కారణమని వారు చెప్పగా, బిగ్ బాస్ కూడా భైరవ టీమ్‌కే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పాడు.

టాస్క్ గెలవడంతో భైరవ టీమ్‌కి ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. అవతలి టీమ్ నుంచి రెండు కత్తులను దక్కించుకునే అవకాశం రావడంతో వంశీ వెళ్లి ముకేశ్ కత్తిని, సుధీర్ వెళ్లి త్రిగుణ్ కత్తిని తీసేసుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లో అసలైన డ్రామా స్టార్ట్ అయింది

కెప్టెన్ అపూర్వ రూమ్‌లో ఉన్న సోఫాలో సుధీర్ వెళ్లి కూర్చోవడంతో ముకేశ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. అదే టైమ్‌లో రోహిత్ – త్రిగుణ్ మధ్య ఏకంగా మాటల యుద్ధం కాస్త ఘాటుగానే జరిగింది. కొద్దిసేపటికే కెప్టెన్ రూమ్‌‌లోకి వర్షిణి ఎంటర్ అవ్వడంతో ముకేశ్, అపూర్వ మధ్య కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ నడిచింది.

ఆ తర్వాత అసలైన నామినేషన్ల ఫైట్ మొదలయింది. భైరవ టీమ్ విన్ అవడంతో.. ఓడిపోయిన సప్త శక్తి టీమ్ సభ్యులందరూ డైరెక్ట్‌గా నామినేషన్‌లోకి వెళ్లిపోయారు. అయితే సప్త శక్తి టీమ్‌లో కేవలం ఇద్దరికి మాత్రం వేరే వాళ్లను నామినేట్ చేసే స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్(Bigg Boss 10 Telugu Day 23).. ఆ ఇద్దరెవరనేది టీమ్ మొత్తం చర్చించుకుని నరేష్, త్రిగుణ్‌ను సెలెక్ట్ చేసుకుంది. నామినేట్ చేయాలనుకున్న వారి ఫేస్‌పై ఫోమ్ స్ప్రే కొట్టాలని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. అయితే టెంప్టేషన్ టాస్క్ వల్ల ముకేశ్ ఆల్రెడీ నామినేట్ అవ్వగా, కెప్టెన్ కావడంతో అపూర్వకి నామినేషన్ అవకుండా ఇమ్యూనిటీ లభించింది.

నామినేషన్ల ప్రాసెస్‌లో త్రిగుణ్ ఫస్ట్ వచ్చి రోహిత్‌ను టార్గెట్ చేశాడు. రోహిత్ చేసే పనులను, మైండ్ మానిప్యులేషన్ స్ట్రాటజీలను, అగ్నిపరీక్ష పేరుతో ఆడుతున్న గ్రూపిజం గురించి చెబుతూ నామినేట్ చేశాడు. హౌస్‌లో రోహిత్ పనులు సరిగ్గా చేయట్లేదని, బద్ధకం చూపిస్తున్నాడని అనగా రోహిత్ గట్టిగానే కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత నరేష్.. అమన్‌ను నామినేట్ చేశాడు. అమన్ చిన్న విషయాలకే ట్రిగ్గర్ అయి గొడవలకు దిగుతున్నాడని, సంచాలక్‌గా ఫెయిల్ అయ్యాడని, పనుల్లో బద్ధకం పెరిగిపోయిందని కారణాలు చెప్పాడు.

విజేత భైరవ టీమ్ నుంచి ఝాన్సీ సృష్టిని నామినేట్ చేస్తూ.. ఓ టాస్క్‌లో తనను నామినేట్ చేయకు అని అడుక్కుందని, అంత వీక్ ప్లేయర్ హౌస్‌లో ఉండటం వేస్ట్ అని చెప్పింది. అమన్ .. త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు. మిథిలేష్ విషయంలో జరిగిన వివాదంతో పాటు, అమన్ పని చేయకపోతే త్రిగుణ్ అన్న మాటలను గుర్తుచేస్తూ స్ప్రే కొట్టాడు. అపూర్వ కూడా త్రిగుణ్‌నే టార్గెట్ చేస్తూ..చాలా ఇరిటేటింగ్ పర్సన్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని నామినేట్ చేసింది.

ఇక రామ్ ప్రసాద్ షాలినిని నామినేట్ చేసి.. బిగ్ బాస్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూా లేట్ చేయడం, నిన్న గొడవను రీకాల్ చేస్తూ పాయింట్స్ చెప్పాడు. రామ్ ప్రసాద్ చాలా కూల్‌‌గా మాట్లాడుతున్నా షాలిని మాత్రం అరుస్తూ హంగామా చేసింది. రోహిత్ వచ్చి దేబ్జానీని నామినేట్ చేసి.. ఆమె గేమ్ ఎక్కడా కనపడట్లేదని, నామినేషన్ల ప్రాసెస్ అసలు తెలీదని, హౌస్‌లో ఏదో క్వీన్ విక్టోరియాలా ఫీల్ అవుతోందని సెటైర్లు వేశాడు. దీంతో దేబ్జానీ, రోహిత్‌ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ నడవగా, నరేష్ ఎంటర్ అయి దేబ్జానీకి సపోర్ట్‌గా మాట్లాడటంతో రోహిత్ సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది.

Bigg Boss 10 Telugu Day 23
Bigg Boss 10 Telugu Day 23

వర్షిణి లాస్ట్ వీక్ సుధీర్‌తో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని సృష్టిని నామినేట్ చేసింది. వంశీ .. చరణ్‌ను నామినేట్ చేస్తూ.. రీ-ఎంట్రీ ఇచ్చినా గేమ్ మెరుగుపడలేదని, ఇండివిడ్యువాలిటీ లేదని అన్నాడు. దీంతో చరణ్ నా ఇష్టం అని చెబుతూ ఆటిట్యూడ్ చూపించాడు. సుధీర్ కూడా చరణ్‌నే నామినేట్ చేసి..లాస్ట్ వీక్ చరణ్ చేసిన తప్పులను నాగార్జున, బిగ్ బాస్‌ (Bigg Boss 10 Telugu Day 23)  చెప్పినా.. చరణ్ ఇంకా నేనే కరెక్ట్ అంటూ మాట్లాడటంపై సుధీర్ క్లాస్ పీకాడు. మొత్తంగా ఈ వీక్ నామినేషన్ల వేడి హౌస్‌లో ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది.

Khairatabad By Election : ఎస్‌ఐఆర్ తర్వాత మొదటి సమరం.. సిటీ పీఠం దక్కించుకునేది ఎవరు?

Related Articles

Back to top button