Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss Captaincy Task : బిగ్ బాస్ హౌస్‌లో దగా పడ్డ అగ్నిపరీక్ష బ్యాచ్.. రసవత్తరంగా కెప్టెన్సీ టాస్క్..

Bigg Boss Captaincy Task : గ్రూపు పాలిటిక్స్, సేఫ్ గేమ్ స్ట్రాటజీలతో హౌస్‌మేట్స్ ఆడుతున్న ప్లానింగ్స్ బిగ్ బాస్ హౌస్‌ను మరింతగా హీటెక్కిస్తున్నాయి.

Bigg Boss Captaincy Task

రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్‌లో డైలీ ఒక కొత్త డ్రామా, ఒక ఊహించని ట్విస్ట్ ఆడియన్స్‌ను టీవీ స్క్రీన్లకు కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా గ్రూపు పాలిటిక్స్, సేఫ్ గేమ్ స్ట్రాటజీలతో హౌస్‌మేట్స్ ఆడుతున్న ప్లానింగ్స్ మరింతగా హీటెక్కిస్తున్నాయి. నామినేషన్ల గండం నుంచి బయటపడటానికి, కెప్టెన్సీ పీఠాన్ని దక్కించుకోవడానికి కంటెస్టెంట్లు మైండ్ గేమ్‌లు ఆడుతూ రచ్చ చేస్తున్నారు.

ఇలాంటి టెన్షన్ వాతావరణంలోనే, ముకేశ్ , ఝాన్సీ అలాగే షాలిని ,రోహిత్ పెయిర్స్ విషయంలో బిగ్ బాస్ ఒక కండీషన్ విధించాడు. లాస్ట్ ప్లేసుల్లో ఉన్న ఈ రెండు జంటల్లో ఒక్కొక్కరు మాత్రమే ఆట ఆడాలని, మరొకరు డైరెక్ట్‌గా డేంజర్ జోన్‌లోకి వెళ్లాలని అన్నాడు. విధిలేక ఆ డెసిషన్ కంటెస్టెంట్లకే వదిలేయగా, ఝాన్సీ తనదైన స్ట్రాటజీతో ముకేశ్‌ని ఆడటానికి పంపి తాను డేంజర్ జోన్‌కి వెళ్లడానికి రెడీ అయింది. . ఇటు షాలిని కూడా తాను డేంజర్ జోన్‌కి వెళ్తానని చెప్పడంతో, రోహిత్ ఆటలోకి దిగాడు. దాంతో ముకేశ్, షాలిని ఇద్దరూ కలిసి జంటగా గేమ్ ఆడతారని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.

దీంతో ఫ్లిప్ చెయ్, ఫేస్ చెయ్ అనే ఇంట్రస్టింగ్ గేమ్ హౌస్‌లో మొదలైంది. కింద ఉన్న టైల్స్ తిప్పినప్పుడు వచ్చే డేర్స్ , డేంజరస్ టాస్కులను బట్టి సంచాలకులుగా ఉన్న దేబ్జానీ, ఝాన్సీ..వారికి పాయింట్లు ఇస్తూ ఎలిమినేట్ చేసే ప్రాసెస్ నడిచింది. స్లో మోషన్ ఫైటింగ్ వచ్చినప్పుడు ముకేశ్, వంశీ ఫన్నీగా పెర్ఫార్మ్ చేశారు. అయితే హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో అపూర్వ టాస్క్ నుంచి అవుట్ అయింది.

ఆ తర్వాత డైస్ గేమ్‌లో నరేష్‌కి వచ్చిన రూల్స్ వల్ల షాలిని ఎలిమినేట్ అవగా, దోమలా యాక్ట్ చేసే ఛాలెంజ్ కంప్లీట్ చేసి ముకేశ్ కూడా గేమ్ నుంచి తప్పుకున్నాడు. చరణ్ తనకి పడని వంశీని పొగడుతూ ట్రోల్ చేయగా, చివరికి ఈ ఎంటర్టైన్మెంట్ టాస్క్‌లో రామ్ ప్రసాద్, నరేష్ విజేతలుగా నిలిచారు. కాకపోతే రామ్ ప్రసాద్, నరేష్‌లో కూడా ఒక్కరే సేవ్ అవుతారని బిగ్ బాస్ చెప్పడంతో రామ్ ప్రసాద్ సేఫ్ జోన్‌కి, నరేష్ డేంజర్ జోన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.

ఇక హౌస్‌లో అసలైన కెప్టెన్సీ(Bigg Boss Captaincy Task) రచ్చ షురూ అయింది. సుధీర్, వంశీ, వర్షిణి, అమన్, త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ కెప్టెన్సీ రేసులో నిలిచారు. ఇదే టైమ్‌లో ఝాన్సీ తెలివిగా బిగ్ బాస్ ఇచ్చిన తన మ్యాజిక్ పవర్‌ను యూజ్ చేసుకుని, నామినేషన్ల ఎలిమినేషన్ గండం నుంచి డైరెక్టుగా సేవ్ అయిపోయింది. కాకపోతే ఆమె కెప్టెన్సీకి పోటీ పడలేదని బిగ్ బాస్ మెలిక పెట్టారు.
ఫైనల్‌గా ఈ వీక్ నామినేషన్స్ డేంజర్ జోన్‌లో ముకేశ్, రోహిత్, షాలిని, నరేష్, చరణ్, అపూర్వ ఉన్నారు.

మరోవైపు కెప్టెన్సీ(Bigg Boss Captaincy Task) రేసులో ఉన్న ఏడుమందిలో కేవలం ఐదుగురు మాత్రమే ఆడాలని బిగ్ బాస్ చెప్పడంతో హౌస్‌లో వర్షిణి, అమన్‌ను పక్కన పెట్టడానికి ట్రై చేశారు. వర్షిణి ఇప్పటికే ఈ వీక్ కెప్టెన్ కాబట్టి ఓకే చెప్పినా, అమన్ మాత్రం రోహిత్ రెచ్చగొట్టడంతో తన టీమ్‌తో గొడవకు దిగాడు. హౌస్ అంతా గందరగోళంగా మారడంతో, బిగ్ బాస్ ఎంటర్ అయి అమన్‌ని పక్కన పెట్టి సుధీర్, వంశీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీతో కెప్టెన్సీ రేస్ నడిపించారు.

Bigg Boss Captaincy Task
Bigg Boss Captaincy Task

షిప్ మేకింగ్ స్ట్రిక్ట్ టాస్క్‌లో ప్రతి పోటీదారుడు ఇద్దరు హెల్పర్ల హెల్ప్ తీసుకునే అవకాశం ఉండటంతో, సుధీర్ ఎంతో తెలివిగా అమన్, ఝాన్సీని తన సపోర్టర్లుగా ఎంచుకున్నాడు. బీన్ బ్యాగ్స్ చింపి అందులోని పార్ట్స్‌తో ఓడ మోడల్‌ను తయారు చేసే ఈ రేసులో ఫస్ట్ లెవెల్‌లో త్రిగుణ్, దేబ్జానీ ఓడిపోగా.. సుధీర్, వంశీ, రామ్ ప్రసాద్‌ నెక్స్ట్ లెవెల్‌కి చేరారు.

అక్కడి నుంచి ఝాన్సీ సాయంతో అందరికంటే వేగంగా టాస్క్‌ను(Bigg Boss Captaincy Task) ఫినిష్ చేసిన సుధీర్, ఈ వీక్కి కొత్త కెప్టెన్‌గా అవతరించి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. సుధీర్ తన గెలుపునకు కారణమైన రామ్ ప్రసాద్ కాళ్లకు దండం పెట్టి కృతజ్ఞత తెలపడం అందరినీ ఆకట్టుకుంది. ఎంత స్కెచ్ వేసినా, ఎన్ని ప్లాన్స్ వేసినా తమ బ్యాచ్ నుంచి ఎవరూ కెప్టెన్ కాలేకపోయారనే అసహనంతో అగ్నిపరీక్ష బ్యాచ్ ఫేస్‌లు మాడిపోవడం.. దానికి సుధీర్, రామ్ ప్రసాద్‌ కలిసి నవ్వుకోవడం ఫ్రైడే ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడింది.

SS Rajamouli : దునియాను ఏలుతున్న జక్కన్న గ్లోబల్ జర్నీ.. ఎస్ఎస్ రాజమౌళి బర్త్ డే స్పెషల్..

Related Articles

Back to top button