Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss New Captain : అమన్‌‌కు షాకిచ్చి కెప్టెన్సీ కొట్టేసిన వర్షిణి.. బిగ్ బాస్ హౌస్‌లో పవర్ మైండ్ గేమ్..

Bigg Boss New Captain : కష్టపడి సాధించిన కెప్టెన్సీని క్షణాల్లో వేరేవాళ్లు లాక్కోవడం, గెలవలేకపోయినా కూడా పవర్‌తో కెప్టెన్‌గా మారడం చూస్తుంటే బిగ్ బాస్ హౌస్‌లో నీతి, కష్టం కంటే స్మార్ట్ గేమ్‌ ఉన్నవాడిదే రాజ్యం అనేలా ఉంది.

Bigg Boss New Captain

కెప్టెన్సీ సాధించడం ఒక ఎత్తయితే, దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు అని ప్రూవ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్‌లో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్‌లు ఎదురయ్యాయి. వరుస టాస్కుల్లో గెలిచి టాప్‌లో ఉన్న భైరవ రెడ్ జట్టుకు బిగ్ బాస్ షాక్ ఇస్తూ, కేవలం ఐదుగురు మాత్రమే కెప్టెన్సీ రేసులో ఉండాలని ఆర్డర్ పాస్ చేయడంతో హౌస్‌లో గొడవల తుపాను మొదలైంది.

కెప్టెన్సీ కంటెండర్లుగా ఎవరు వెళ్లాలనే విషయంపై రెడ్ టీమ్‌లో చర్చలు ఇలా మొదలవగానే.. రోహిత్ అలా తన అగ్నిపరీక్ష బ్యాచ్‌ను గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్లాన్లు వేశాడు. అమన్ కెప్టెన్ అవుతానంటే వద్దని రోహిత్ అడ్డుపడగా.. బ్లూ టీమ్ వాళ్లు కూడా వీళ్ల మధ్య కాస్త పుల్లలు పెట్టడంతో ఈ గొడవలు పీక్స్‌కి వెళ్లాయి. గొడవ ఎంతకీ తేలకపోవడంతో చివరకు బిగ్ బాస్ క్లాస్‌తో ఓటింగ్ వైపు వెళ్లాల్సి వచ్చింది.

సుధీర్, ముకేశ్ ఎంకరేజ్ చేయడంతో అమన్ రేసులోకి రాగా.. ఆ తర్వాత ఓటింగ్ ప్రాసెస్ ద్వారా వర్షిణి, ఝాన్సీ, రామ్ ప్రసాద్, అపూర్వ, అమన్‌ కెప్టెన్సీ రేసులోకి సెలెక్ట్ అయ్యారు. అయితే అమన్ సెలెక్ట్ అవ్వడం నచ్చని రోహిత్, అతన్ని పిలిచి ‘సెలబ్రిటీ బ్యాచ్ మోజులో పడి డెసిషన్స్ తీసుకుంటున్నావని నెగిటివ్ థాట్స్ మైండ్‌లోకి ఎక్కించడానికి ట్రై చేశాడు.

ఇక అసలైన కెప్టెన్సీ ఫైట్..పాత్ టు పవర్ గేమ్‌ను బిగ్ బాస్ అనౌన్స్ చేయగా.. మూడు స్టేజ్‌లలో సాగిన ఈ గేమ్ ఫుల్ క్యూరియాసిటీని రేపింది. మొదటి లెవెల్‌లో సుధీర్, షాలిని సంచాలకులుగా.. అమన్, రామ్ ప్రసాద్, ఝాన్సీ పోల్స్ బ్యాగ్స్‌తో బ్రిడ్జ్ కట్టి నెక్ట్స్ రౌండ్‌కి క్వాలిఫై అయ్యారు. రెండో రౌండ్ బాల్స్ టాస్క్‌లో అమన్, ఝాన్సీ ఫైనల్ చేరుకోగా.. చివరి రౌండ్ ఐ-లోగో పజిల్ గేమ్‌ను అమన్ స్పీడ్‌గా కంప్లీట్ చేసి అఫీషియల్‌గా బిగ్ బాస్ హౌస్ కెప్టెన్‌(Bigg Boss New Captain)గా నిలిచాడు. ఓడిపోయినని ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకోగా, అమన్ ఫుల్ ఖుషీ అయిపోయాడు.

కానీ అసలైన కథ అక్కడే స్టార్ట్ అయింది. వర్షిణి తన దగ్గరున్న మ్యాజికల్ పవర్ వాడతానని బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేయడంతో.. బిగ్ బాస్ కీస్ పంపాడు. ఇలా వర్షిణి ఇచ్చిన మాస్టర్ ట్విస్ట్‌కు అమన్ ప్లేస్‌లో వర్షిణి ఈ వీక్‌లో హౌస్‌కు కెప్టెన్(Bigg Boss New Captain) అయిపోయింది. కష్టపడి గెలిచిన అమన్‌కు సారీ చెబుతూనే.. తన దగ్గరున్న పవర్‌తో కెప్టెన్సీని సొంతం చేసుకుని గోల్డ్ మెడల్ తీసుకుంది. అంతేకాదు కెప్టెన్ అయిన ఆనందంలో ముకేశ్ కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం కూడా తీసుకుంది. ఇలా ఊహించని వర్షిణి మైండ్ గేమ్‌తో హౌస్‌మేట్స్ అందరి మైండ్‌లు బ్లాక్ అయిపోయాయి.

మరోవైపు ఇమ్యూనిటీ డాగర్ల కోసం బిగ్ బాస్ హౌస్‌లో సీక్రెట్ ఆపరేషన్లు నడిచాయి. దీనిలో నరేష్ ప్రమాదకరంగా కత్తులను దాస్తుంటే బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. కనీసం ఒక కత్తి అయినా ఉంటేనే ఇమ్యూనిటీ రేసులో ఉంటారని, అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్లు వేరొకరికి ఇమ్యూనిటీ ఇచ్చే పవర్‌ను కూడా పొందుతారని బిగ్ బాస్ చెప్పడంతో.. డాగర్లు లేనివాళ్లంతా ఉన్న కాళ్లు పట్టుకుని బతిమాలడం స్టార్ట్ చేశారు.

Bigg Boss New Captain
Bigg Boss New Captain

దీని తర్వాత నడిచిన పోటాపోటీ ఇమ్యూనిటీ టాస్క్‌‌లో సృష్టి, సుధీర్, ఝాన్సీ, త్రిగుణ్, వంశీ, చరణ్‌‌ మధ్య సస్పెన్స్ డ్రామా సాగి.. ఫైనల్‌గా వంశీ, సుధీర్‌ సిక్త్ వీక్‌కు సంబంధించిన గ్రాండ్ ఇమ్యూనిటీని దక్కించుకున్నారు.

కష్టపడి సాధించిన కెప్టెన్సీని క్షణాల్లో వేరేవాళ్లు లాక్కోవడం, గెలవలేకపోయినా కూడా పవర్‌తో కెప్టెన్‌గా మారడం చూస్తుంటే బిగ్ బాస్ హౌస్‌లో నీతి, కష్టం కంటే స్మార్ట్ గేమ్‌ ఉన్నవాడిదే రాజ్యం అని తెలిసిపోతుంది. మరి కొత్త కెప్టెన్(Bigg Boss New Captain) వర్షిణి బిగ్ బాస్ హౌస్‌ను ఎలా ఏలుతుందో, అమన్ ఈ షాక్ నుంచి కోలుకుని ఎలాంటి రివెంజ్ ప్లాన్ చేస్తాడా, లేక కో ఆపరేట్ చేస్తాడా అనేది చూడాలి.

Country Chicken Egg Vs Farm Egg : నాటుకోడి గుడ్డు నాన్వెజ్.. ఫారమ్ గుడ్డు వెజ్ ఎందుకు? ఈ సైంటిఫిక్ సీక్రెట్ తెలుసుకుంటే ఫుల్ క్లారిటీ..

Related Articles

Back to top button