Bigg Boss Nominations : బిగ్‌బాస్ హౌస్ 5వ వారం నామినేషన్ల రచ్చ.. గుమ్మడికాయ గేమ్‌తో మైండ్ గేమ్స్..
Bigg Boss Nominations : పాత గొడవలన్నీ తవ్వి తీయడంతో ఐదో వారం నామినేషన్లు రచ్చ రచ్చగా సాగాయి.
Bigg Boss Nominations
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పటివరకు నాలుగు వారాలను కంప్లీట్ చేసుకోగా.. నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఇప్పటికే హౌస్ మేట్స్ అందరివీ స్ట్రాటజీలు, గేమ్‌ప్లాన్ పూర్తిగా మారిపోయాయి. ఐదో వారంలోకి అడుగుపెట్టిన హౌస్‌మేట్స్‌కు సోమవారం జరిగిన నామినేషన్స్(Bigg Boss Nominations) టాస్క్.. మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది.
ఈసారి కెప్టెన్ వర్షిణి, ఇమ్యూనిటీ గెలుచుకున్న సుధీర్ , వంశీని నామినేట్ చేయడానికి వీల్లేకుండా పక్కన పెట్టేసి, మిగిలిన వారికోసం బిగ్‌బాస్ ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లాన్ చేశాడు. హౌస్‌లో గుమ్మడికాయను దాచిపెట్టే టాస్క్ పెట్టి, దాన్ని వెతికి పట్టుకున్నవారికి ఇద్దరిని, ఓడిపోయిన వారికి ఒకరిని నామినేట్(Bigg Boss Nominations) చేసే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో ప్రతీ రౌండ్ కూడా ఒక పెద్ద మిస్టరీ డ్రామాలా మారిపోయింది.
మొదటి రౌండ్లో వర్షిణి దాచిన గుమ్మడికాయను వెతికి రామ్‌ప్రసాద్ విన్నర్ అయ్యాడు. తర్వాత రామ్‌ప్రసాద్ ఏమాత్రం తగ్గకుండా డాగర్ టాస్క్ విషయాన్ని మళ్లీ తీసుకువచ్చి త్రిగుణ్ మెడ పట్టుకోలేదని అబద్ధం చెప్పావంటూ మొదట అమన్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత త్రిగుణ్‌తో ..నువ్వు నా హీరోవి , కానీ రోహిత్‌ను అలా అనేయడం అస్సలు నచ్చలేదని.. కోపం గేమ్‌లో ఉండాలి కానీ బయట కాదంటూ పాయింట్ టు పాయింట్ మాట్లాడి నామినేట్ చేశాడు.
ఇక్కడే బిగ్ ట్విస్ట్ పడింది. రామ్ ప్రసాద్ మాటలతో త్రిగుణ్ వెంటనే డిఫెండ్ చేసుకోకుండా రోహిత్‌కు సారీ చెప్పగా, రోహిత్ మాత్రం తాను క్షమించేదే లేదని ముఖం మీదే తెగేసి చెప్పడంతో వీరిద్దరి మధ్య గట్టి మాటల యుద్ధమే నడిచింది. మరోవైపు ముకేష్ నామినేషన్స్‌లోకి వచ్చి.. అపూర్వ కెప్టెన్సీ ప్రవర్తనపై ఫైర్ అయ్యాడు. దీనికి లవ్ స్టోరీల పేరుతో చిన్నది పెద్దది అని అనడం పద్ధతి కాదంటూ అపూర్వ కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య వార్ పీక్స్‌కి చేరింది.

దీని తర్వాత రెండో రౌండ్లో వంశీ దాచిన గుమ్మడికాయను త్రిగుణ్ గెలుచుకుని అపూర్వ, అమన్‌ను నామినేట్ చేశాడు. అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెబుతూ హౌస్ నిబంధనలను బ్రేక్ చేశావని అపూర్వపై విరుచుకుపడ్డాడు. ఇక అమన్ వంతు రాగానే, ఒకరిని మెచ్చుకోవడానికి ఇంకొకరిని కించపరుస్తూ బచ్చాగాడు అని మాట్లాడాడంటూ ముకేష్‌ను నామినేట్ చేశాడు.
ఇక నరేష్ దాచిన గుమ్మడికాయను దక్కించుకున్న వర్షిణి .. అపూర్వను వైల్డ్ కార్డ్‌గా వచ్చి పోస్ట్ కార్డ్‌లా పని చేస్తుందని సెటైర్ వేస్తూ అపూర్వతో పాటు రోహిత్‌ను కూడా నామినేట్ చేసింది. కాగా టాస్క్‌లో ఓడిపోయిన షాలినీ వచ్చి మాటలు జారుతున్నాడని, డామినేట్ చేస్తున్నాడని త్రిగుణ్‌ను టార్గెట్ చేసింది. మొత్తం మీద పాత గొడవలన్నీ తవ్వి తీయడంతో ఐదో వారం నామినేషన్లు(Bigg Boss Nominations) రచ్చ రచ్చగా సాగాయి.
Quit Smoking : స్మోకింగ్ మానేసినా ముప్పు తప్పదా? మరి ఎప్పుడు మానేస్తే లంగ్స్ సేఫ్‌గా ఉంటాయి?





