Vaibhav Sooryavanshi : 53 బంతుల్లో 204 పరుగులు..28 సిక్సర్లతో వైభవ్ సూర్యవంశీ ఊచకోత
Vaibhav Sooryavanshi : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో వైభవ్ సూర్యవంశీ 53 బాల్స్‌లో 204 పరుగులతో విధ్వంసం క్రియేట్ చేశాడు. యూఏఈ-ఎపై ఇండియా-ఎ విజయం, మ్యాచ్ వివరాలిక్కడ చూడండి.
Vaibhav Sooryavanshi
క్రికెట్లో కొన్ని ఇన్నింగ్స్ చూస్తే రియల్ లైఫ్‌లో సాధ్యమా అన్నంత షాక్ ఇస్తాయి. బౌలర్లు ఎంత ప్లాన్ వేసి కంట్రోల్ చేసినా.. ఫీల్డింగ్ ఎలా మార్చినా బ్యాటర్ మాత్రం ఓ రేంజ్లో చెలరేగిపోతుంటాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో వైభవ్ సూర్యవంశీ కూడా అచ్చం అలాంటి విధ్వంసాన్నే క్రియేట్ చేశాడు. యూఏఈ-ఎతో జరిగిన మ్యాచ్‌లో 53 బాల్స్‌లోనే 204 రన్స్ బాదేసి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. బుడ్డోడి తుపాన్ ఇన్నింగ్స్ దెబ్బకు ఇండియా-ఎ జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని కొట్టింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న యూఏఈ-ఎకు స్టార్టింగ్‌లోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీనికి తోడు భారత్ బౌలర్ అర్షద్ ఖాన్ తన స్పెల్‌తో యూఏఈ బ్యాటర్లను బాగానే కట్టడి చేశాడు. అయితే హర్‌ప్రీత్ సింగ్ భాటియా మాత్రం అద్భుతంగా నిలబడి 144 బంతుల్లో 130 పరుగులు చేయడంతో యూఏఈ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 249 రన్స్ చేసింది. అర్షద్ ఖాన్ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ ఓటమితో యూఏఈ-ఎ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది.
ఇక 250 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా-ఎకు స్టార్టింగ్‌లోనే రెండు వికెట్లు పడ్డాయి. అయినా వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఏమాత్రం తగ్గలేదు. ఎలాంటి బౌలర్లు వచ్చినా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బాల్స్‌లోనే ఫిఫ్టీ కొట్టిన వైభవ్, ఆ తర్వాత మరో 12 బంతుల్లోనే సెంచరీ మార్కును టచ్ చేశాడు.
అక్కడితో ఆగకుండా 40 బాల్స్‌లో 150 పరుగులు చేసి, చివరకు 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాది రికార్డుల దుమ్ముదులిపాడు. మొత్తం 53 బాల్స్‌లో 204 పరుగులు చేసిన అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 28 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయంటేనే బుడ్డోడి విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.
వైభవ్(Vaibhav Sooryavanshi) బ్యాటింగ్ ఊపుతో ఇండియా-ఎ కేవలం 14.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించి ఘన విజయాన్ని సాధించింది. దీనికి ముందు పాకిస్థాన్-ఎ చేతిలో ఓడిన జట్టుకు ఈ గెలుపు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో సెమీస్ రేసులో ఇండియా-ఎ తన ఆశలను మరింత స్ట్రాంగ్‌గా మార్చుకుంది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టోర్నీలో ఫుల్ ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయాడు.
Megaverse : వైరల్‌గా చిరంజీవీస్ మెగావర్స్ ప్రోమో.. నా అడ్డా అంటూ చిరు రచ్చ..





