Bigg BossJust EntertainmentLatest News

New Captain : బిగ్ బాస్ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా అమన్.. డైరెక్ట్‌గా ఫైనల్ వీక్‌లోకి వెళ్లే ఛాన్స్..

New Captain : బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన లేటెస్ట్ ఎపిసోడ్‌లో ముకేష్ తీరుతో టీమ్‌లో చీలిక, ఫుడ్ పంచాయితీ, కెప్టెన్సీ పోరులో అమన్ విజయం వంటి ఆసక్తికర విషయాలు హౌస్‌ను హీటెక్కించాయి.

New Captain

బిగ్ బాస్ హౌస్‌లో శుక్రవారం ఎపిసోడ్‌లో వెయిట్ హోల్డింగ్, ప్రశ్నల టాస్క్ లాస్ట్‌ స్జేజ్‌కు చేరుకోవడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. రామ్ ప్రసాద్ బరువు తట్టుకోలేక వదిలేయగా, అమన్ మాత్రం ఎక్కువసేపు నిలబడ్డాడు. కానీ ముకేష్ మాత్రం ఎక్కువ వెయిట్ మోశామనే కారణంతో తన టీమ్‌ను విజేత అని ప్రకటించడం అందరినీ ఆశ్చర్చానికి గురి చేసింది. వంశీ.. త్రిగుణ్ టీమ్ వైపు నిలబడగా, సుధీర్ మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. చివరికి బిగ్ బాస్ ఇంటర్‌ఫియర్ అయి ఎక్కువసేపు హోల్డ్ చేసి, ఎక్కువ సమాధానాలు ఇచ్చిన టీమ్ గెలిచిందని చెప్పడంతో త్రిగుణ్‌ టీమ్ విజేతగా నిలిచింది.

విజయం సాధించిన త్రిగుణ్ టీమ్‌కు అపోజిట్ టీమ్ నుంచి ఒకరిని పోటీ నుంచి తప్పించే ఛాన్స్ రాగా, త్రిగుణ్.. రామ్ ప్రసాద్ పేరు చెప్పాడు. ఆట నియమాలు అర్థం కాక వర్షిణి ..త్రిగుణ్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఆ తర్వాత డిక్టేటర్ త్రిగుణ్ కటౌట్‌ను కిచెన్‌లో ఉంచాలని బిగ్ బాస్ ఆదేశించాడు. భోజన విషయంలో కూడా కొత్త కండీషన్లు పెట్టాడు. గెలిచిన టీమ్‌కు, డిక్టేటర్లకు బిర్యానీ.. ఓడిన టీమ్ కోసం గంజి, పొటాటో పంపారు. అలాగే ఓడిన టీమ్ గెలిచిన వారి కోసం కుక్ చేయాలని, ఓడిన వారికి బిగ్ బాస్ ఫుడ్ పంపుతాడని చెప్పాడు.

ఈ పరిణామాల మధ్య ముకేష్ వ్యవహారశైలిపై సుధీర్, రామ్ ప్రసాద్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముకేష్ కేవలం వర్షిణికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని రామ్ ప్రసాద్ ఆవేదన చెందగా, ఈ టీమ్‌లో ఉండనని సుధీర్ స్పష్టం చేశాడు. మరోవైపు నరేష్ గంజి తింటుండటం చూసి రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకోవడంతో.. త్రిగుణ్, వంశీ, దేబ్జానీ అతన్ని ఓదార్చారు. అంతేకాదు, త్రిగుణ్ తన టీమ్‌తో పాటు రామ్ ప్రసాద్, నరేష్‌కు కూడా స్వయంగా ఫుడ్ ఇచ్చాడు.

ఇక క్లీనింగ్ విషయంలో రెండు జట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. 2 రోజులుగా ఓడిన టీమ్ క్లీనింగ్ చేయడం లేదని త్రిగుణ్‌ నిలదీశాడు. మరోవైపు ఓడిన టీమ్‌కు వచ్చిన ఆహారాన్ని త్రిగుణ్ టీమ్ తీసుకెళ్లి, తాము వండిన తర్వాతే తినాలని చెప్పడంతో గొడవ ఇంకా ముదిరింది. కిచెన్‌లోకి ముకేష్ రావడంపై త్రిగుణ్ అభ్యంతరం తెలపడంతో ఇద్దరి మధ్య వార్ నడిచింది.

కాగా ఇప్పటివరకు జరిగిన టాస్కులలో ఎక్కువ విజయాలు సాధించిన త్రిగుణ్ టీమ్ సభ్యులు కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడతారని బిగ్ బాస్ ప్రకటించాడు. ముకేష్ టీమ్ నుంచి ముగ్గురు సభ్యులు ఒక ఛాలెంజ్ ద్వారా కంటెండర్ ప్లేస్ కోసం పోటీ పడాలని సూచించాడు. కంటెండర్ రేసులో నిలబడడానికి నీతూ అడిగినప్పుడు ముకేష్ పెట్టిన కండీషన్స్ ఇద్దరి మధ్య వాదనకు దారితీశాయి. చివరకు రామకృష్ణ, ముకేష్, నీతూ పోటీ పడగా, నీతూ విజయం సాధించి కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించింది.అయితే తాను కావాలనే ఓడిపోయానంటూ ముకేష్ చెప్పగా.. సుధీర్ సూటిగా ప్రశ్నించడంతో ముకేష్ ఆన్సర్ దాటవేశాడు.

మరోవైపు త్రిగుణ్ తన టీమ్ నుంచి ముగ్గురు కంటెండర్ల పేర్లను డైరెక్టుగా బిగ్ బాస్‌కే చెబుతానని అన్నాడు. వర్షిణి మైక్ వేసుకోకపోవడంతో బిగ్ బాస్ ఆమెను గదిలో ఉంచి లైట్లు ఆపేయగా.. చీకటిలో భయపడిన వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కంటెండర్ టాస్క్‌కు త్రిగుణ్‌ సెలక్ట్ చేసిన అమన్, శివ్, దేబ్జానీతో పాటు నీతూ మధ్య కెప్టెన్సీ ఫైట్ జరిగింది.

ఈ పోటీలో అమన్ విజేతగా నిలిచి బిగ్ బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్ (New Captain))అయ్యాడు. తన గేమ్‌ను అమన్ అడ్డుకున్నాడని శివ్ వాదించినా ఫలితం మారలేదు. అయితే కెప్టెన్‌గా నిలిచిన అమన్ ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి గట్టెక్కితే మాత్రం.. డైరెక్టుగా పదమూడో వారం ఫైనల్ వీక్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ దక్కుతుందని బిగ్ బాస్ చెప్పడం హాట్ న్యూస్ అయింది.

Revanth Reddy Love Story : రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ.. ఢిల్లీకి వెళ్లి మరీ పెళ్లికి ఒప్పించిన రేవంత్ రెడ్డి..

Related Articles

Back to top button