Bigg BossJust EntertainmentLatest News

Nominations For The 6th Week : ఆరోవారం నామినేషన్స్ హీట్..ఓటింగ్‌లో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిన ఆ సెలబ్రెటీ..

Nominations For The 6th Week : బిగ్ బాస్ హౌస్‌లో కావాల్సినంత లవ్ ట్రాక్, గొడవలు, ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ఇస్తున్న షాలినిని బిగ్ బాస్ మేకర్స్ అంత ఈజీగా బయటికి పంపే అవకాశం లేదనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది.

Nominations For The 6th Week

బిగ్ బాస్ హౌస్‌లో ఆరోవారం ముగ్గురు సెలబ్రిటీలతో పాటు మరో ముగ్గురు కామనర్స్‌తో కలిపి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్ బరిలో నిలిచారు. దసరా పండుగ సమయంలో ఈ వారం ఎలిమినేషన్(Nominations For The 6th Week) ఉంటుందా లేదా అనే సస్పెన్స్ ఒకవైపు అందరిలో తలెత్తగా.. సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ ట్రెండ్స్ అదే రేంజ్‌లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా కంటెస్టెంట్ల పర్సనల్ ఫాలోయింగ్ బట్టి ఓట్లు పడతాయి. కానీ ఈ వీక్ మాత్రం నామినేషన్‌లో లేని ఇతర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ ఓట్లు ఈ సమీకరణాలను పూర్తిగా తారుమారు చేసేస్తున్నాయా అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది.

ఈ వీక్ నామినేషన్స్‌(Nominations For The 6th Week)లో.. షాలిని పేరు కూడా ఉండటంతో ఆమె ఎలిమినేషన్ ఖాయమని ప్రచారం జరిగింది. రోహిత్ కూడా ఆమెతో పాటు నామినేషన్స్‌లో ఉన్నాడు కాబట్టి..అతని సపోర్టర్స్ నుంచి ఆమెకు ఓట్లు షిఫ్ట్ అయ్యే అవకాశం అసలే లేదు. పైగా రోహిత్ గేమ్‌ను కూడా ఆమె డామినేట్ చేస్తుందనే నెగిటివిటీ షాలినిపై గట్టిగానే ఉంది.

అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో కావాల్సినంత లవ్ ట్రాక్, గొడవలు, ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ఇస్తున్న షాలినిని బిగ్ బాస్ మేకర్స్ అంత ఈజీగా బయటికి పంపే అవకాశం లేదనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. రోహిత్‌తో ఆమె ట్రాక్ పీక్స్‌లో ఉండటం, కంటెంట్ పరంగా షాలిని కీలకం కావడంతో ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నా కూడా సేఫ్ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మిగతా కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. రోహిత్ ప్రతీ వారం లాగే ఈ వీక్ కూడా ఓటింగ్‌లో టాప్‌లో దూసుకెళ్తున్నాడు. త్రిగుణ్ సపోర్ట్ వంశీకి కలవడం, ఎపిసోడ్స్ పాజిటివ్‌గా పడటంతో వంశీ, రాంప్రసాద్‌ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. కానీ అసలు సస్పెన్స్ అంతా షాలిని, వర్షిణి, అమన్ ఓటింగ్ చుట్టూనే రౌండ్లు కొడుతోంది. వీరు ముగ్గురూ సుమారు ఒకే రేంజ్‌లో ఓట్లతో పోటీపడుతున్నారు.

ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం ఏమిటంటే.. సోషల్ మీడియాలో ఏకంగా 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న వర్షిణి పరిస్థితి ఆరో వారం డేంజర్ జోన్‌లో పడిపోయింది. ముకేష్ నామినేషన్‌లో లేకపోవడంతో అతని ఓట్లు వర్షిణికి బదిలీ కావాల్సి ఉన్నా.. హౌస్‌లో ముకేష్‌తో ఆమె రిలేషన్ యాంగిల్స్ రిషి సార్ డైరెక్ట్ ఫ్యాన్స్‌కు అంతగా నచ్చడం లేదు.

Nominations For The 6th Week
Nominations For The 6th Week

వర్షిణి వల్ల ముకేష్ గేమ్ దెబ్బతింటుందనే ఒపీనియన్‌తో ఉన్న వారంతా ఆమెకు ఓట్లు వేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. గతంలో రెండుసార్లు వేరే రీజన్స్ వల్ల తృటిలో తప్పించుకున్న వర్షిణి, ఈసారైతే కాస్త ఎక్కువగా డేంజర్ జోన్‌లో చిక్కుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు నాగ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో, ఈ వారం హౌస్‌ను వీడేది ఎవరో చూడాలి.

Edible Camphor : పచ్చ కర్పూరానికీ, నార్మల్ కర్పూరానికీ తేడా ఏంటి ?మనం వెలిగించే కర్పూరం ప్రమాదకరమా?

Related Articles

Back to top button