Just EntertainmentLatest News

Stunt Master:చరణ్ కోసం బాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఎంట్రీ..పెద్దిపై అంచనాలు పీక్స్‌

Stunt Master: తాజాగా, 'పెద్ది' సినిమా నుంచి ఓ ముఖ్యమైన, ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

Stunt Master

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ,డైరక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్దిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేమకథా చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమా స్థాయిని పెంచాయి, ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. మెగా ఫ్యాన్స్ ఈ మాస్ ఎంటర్‌టైనర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా, ‘పెద్ది’ సినిమా నుంచి ఓ ముఖ్యమైన, ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను కొరియోగ్రఫీ చేయడానికి బాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ స్టంట్ మాస్టర్‌ను చిత్ర యూనిట్ తీసుకువచ్చింది. ఆయనే బాలీవుడ్ అగ్రశ్రేణి స్టంట్ మాస్టర్ (Stunt Master)శామ్ కౌశల్.

Stunt Master
Stunt Master

స్టార్ హీరో విక్కీ కౌశల్ తండ్రి అయిన శామ్ కౌశల్, బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి అనేక మంది సూపర్ స్టార్ల బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశారు. తెలుగులో కూడా ఆయనకు కొన్ని సినిమాలు చేసిన అనుభవం ఉంది.

ముఖ్యంగా, ఇటీవల పవన్ కళ్యాణ్ చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’కు యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది కూడా శామ్ కౌశలే. అలా మొన్న బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన ఆయన, ఇప్పుడు అబ్బాయి రామ్ చరణ్ కోసం పనిచేయడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో ఓ ప్రత్యేక కాన్సెప్ట్ ఆధారిత యాక్షన్ సీన్‌ను శామ్ కౌశల్(Stunt Master) కంపోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘పెద్ది’ సినిమా ఫైట్స్ , యాక్షన్ స్థాయిపై కూడా అంచనాలు మరింత పీక్స్‌కు వెళ్లిపోయాయి.

ibomma Ravi: ఐబొమ్మ రవి నోటి వెంట సంచలన విషయాలు ..ఇంతకీ ఆ ప్రహ్లాద్ ఎవరు?

Related Articles

Back to top button