Just EntertainmentLatest News

Comrade Kalyan : ప్రైమ్‌లో శ్రీవిష్ణు హంగామా..సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్..

Comrade Kalyan : శ్రీవిష్ణు నటించిన కామెడీ చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో సైలెంట్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

Comrade Kalyan

తన మార్క్ వినోదం, యాక్షన్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ..కామ్రేడ్ కళ్యాణ్(Comrade Kalyan). జానకిరామ్ మారెళ్ల డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా మెరిసింది. అక్టోబర్ 9వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను బాగానే అలరించింది. అయితే థియేటర్లలో మిస్ అయిన వారి కోసం, మళ్లీ ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయాలనుకునే మూవీ లవర్స్ కోసం ఈ మూవీ డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టేసింది.

ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రీ అనౌన్స్‌మెంట్స్ కూడా ఏదీ లేకుండా కామ్రేడ్ కళ్యాణ్(Comrade Kalyan) సైలెంట్‌గా ఓటీటీ ప్రియులను పలకరించడం విశేషం. ప్రముఖ డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈరోజు అక్టోబర్ 30వ తేదీ నుంచి ఈ మూవీ ప్రత్యక్షమైంది. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ ఆడియన్స్‌కు కూడా అందుబాటులోకి వచ్చేసింది. ప్రైమ్ వినియోగదారులు ఇప్పటి నుంచే ఈ హిలేరియస్ రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ మూవీలో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్,షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయేతో పాటు స్టార్ కమెడియన్ సత్య తమ యాక్షన్‌తో నవ్వులు పూయించారు. కోన వెంకట్ సమర్పణలో మైత్రీ ఫ్రేమ్స్ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి చాలా గ్రాండ్‌గా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న శ్రీవిష్ణు, ఇప్పుడు ఈ డిజిటల్ వేదికపై ఎలా ఎంటర్‌టైన్‌ చేస్తాడో చూడాలి.టోటల్‌గా వీకెండ్‌లో మంచి కామెడీ మూవీ చూడాలనుకునేవారికి కామ్రేడ్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

Hyderabad Water Crises : హైదరాబాద్‌వాసులకు బ్యాడ్ న్యూస్..వచ్చే 8 నెలలలో నీటి కష్టాలు

Related Articles

Back to top button