Ustaad Bhagat Singh:ఉస్తాద్‌కు అడ్డం పడుతున్న ధురంధర్.. వీకెండ్ కింగ్ ఎవరు?
Ustaad Bhagat Singh: మొదటి రోజు దేశవ్యాప్తంగా 34 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ, రెండో రోజు సుమారు 9 కోట్ల రూపాయలు రాబట్టింది.
Ustaad Bhagat Singh
ప్రస్తుతం ఇద్దరు పెద్ద హీరోల మధ్య బాక్సాఫీస్ యుద్ధం గట్టిగా నడుస్తోంది. ఈ నెల మార్చి 19న రిలీజయిన రణవీర్ సింగ్ మూవీ ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది. గతేడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ధురంధర్ మూవీకి ఇది రెండో భాగం కావడంతో, దీనిపై ముందు నుంచే విపరీతమైన అంచనాలున్నాయి.
అయితే ఇదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) కూడా విడుదల కావడంతో అందరి దృష్టి ఈ రెండు సినిమాల వసూళ్ల మీద పడింది. స్పై థ్రిల్లర్ గా వచ్చిన హిందీ మూవీ .. పవన్ కళ్యాణ్ మూవీ కలక్షన్స్ మీద స్పష్టంగా కనిపిస్తోందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
రణవీర్ సింగ్ , డైరెక్టర్ ఆదిత్య ధర్ కలయికలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేస్తుంది. మొదటి రోజే ఇండియాలో వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి.. రెండో రోజు దాదాపు 80 కోట్ల రూపాయలను రాబట్టింది. శుక్రవారం వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కొంచెం తగ్గినా, రెండు రోజుల్లోనే భారత దేశంలో ఈ మూవీ 226 కోట్ల రూపాయల మార్కును దాటేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొదటి రోజే 236 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే శనివారం రాత్రికి ఇండియాలో ఈ మూవీ 250 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల మైలురాయిని కూడా ఈజీగా అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మూవీకి కూడా బాగానే ఆదరణ లభిస్తోంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా 34 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఈ మూవీ, రెండో రోజు సుమారు 9 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం 44 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.
పవన్ కళ్యాణ్ గత సినిమా ఓజీ వసూళ్లతో పోలిస్తే ఇవి కొంచెం తక్కువగా అనిపిస్తున్నా.. ధురంధర్ 2 మేనియా వల్ల ఈ కలెక్షన్స్‌లో తేడా వచ్చిందని భావిస్తున్నారు. అయితే ఆన్లైన్ టికెట్ బుకింగ్స్‌లో మాత్రం పవన్ తన పవర్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు బుక్ మై షో లో సుమారు ఎనిమిదిన్నర లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ వీకెండ్ ముగిసేలోపు పది లక్షల టికెట్ల మార్కును ఈ మూవీ కచ్చితంగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ధురంధర్ 2 మూవీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. కేవలం కొన్ని వందల షోలతోనే తెలుగు వెర్షన్ రెండో రోజు కోటి రూపాయలకు పైగా వసూలు చేయడమే కాదు..ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఉన్నంత ఆక్యుపెన్సీ ధురంధర్ తెలుగు వెర్షన్ కు కూడా ఉండటంతో షాక్ అవుతున్నారు.
ఇప్పటికే సల్మాన్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల లైఫ్ టైమ్ వసూళ్లను ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే క్రాస్ చేసింది. హృతిక్ రోషన్ ఫైటర్ , వార్ సినిమాల రికార్డులను కూడా ఈ మూవీ త్వరలోనే దాటేసేలాగా కనిపిస్తోంది.

అయితే ఈ పోటీ గురించి ఆదిత్య ధర్ వంటి ప్రతిభ గల డైరెక్టర్‌తో పోటీ ఉండటం తనకు గర్వంగా ఉందని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. ధురంధర్.. ఒక సీరియస్ స్పై థ్రిల్లర్ అని, కానీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మాత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ అని ఆయన వివరించారు. రెండు సినిమాల స్టోరీ లైన్స్ వేర్వేరు కాబట్టి, మన తెలుగు ఆడియన్స్ పవన్ కళ్యాణ్ సినిమాను కూడా తప్పకుండా ఆదరిస్తారని హరీష్ శంకర్ అన్నారు.
మరోవైపు ఈ వీకెండ్ వసూళ్లు ఈ రెండు సినిమాలకు ఎంతో కీలకం కానున్నాయి. ధురంధర్ 2 తన రికార్డుల వేటను కంటిన్యూ చేస్తుండగా, ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) వీకెండ్ లో స్పీడప్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.
Supreme Court :పనిమనిషిని కాదు, ప్రాణసఖిని గౌరవించండి..సుప్రీం మొట్టికాయలతో అయినా భర్తలు మారతారా?





