Garividi Lakshmi OTT : ప్రైమ్ వీడియోలో గరివిడి లక్ష్మి స్ట్రీమింగ్..ఆనంది కెరీర్లోనే ఇది మరో గట్టి సినిమా..
Garividi Lakshmi OTT : అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న గరివిడి లక్ష్మి బయోపిక్ రివ్యూ. బుర్రకథ కళాకారిణి జీవితంలోని మలుపులేంటి? ఆనంది నటన ఎలా ఉంది?
Garividi Lakshmi OTT
థ్రిల్లర్లు, మాస్ మసాలాల సందడి మధ్య అప్పుడప్పుడు వచ్చే రియల్ లైఫ్ స్టోరీలు ఆడియన్స్‌ను ఎప్పుడూ ఒక కొత్త ఆలోచనలో పడేస్తాయి. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి లైఫ్ ఆధారంగా వచ్చిన గరివిడి లక్ష్మి(Garividi Lakshmi OTT) కూడా సరిగ్గా అలాంటి సినిమానే. అక్టోబర్ 17న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా, నవంబర్ 26వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో(Garividi Lakshmi OTT) స్ట్రీమింగ్ అవుతోంది.
విజయనగరం జిల్లా గరివిడి ఊరిలో దేవుడమ్మ (రాశి) ఫ్యామిలీతో కథ మొదలవుతుంది. భర్త నాయుడు, కూతురు లక్ష్మితో సాగుతున్న వీరి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. దేవుడమ్మ సన్యాసినిగా మారి..తన భర్తకు వేరే పెళ్లి చేసి, కూతురి బాధ్యతను తనే తీసుకుంటుంది. పాటలంటే ప్రాణం పెట్టే లక్ష్మికి సుబ్బారావు ఇచ్చిన ప్రోత్సాహం బుర్రకథ వైపు నడిపిస్తుంది. చెప్పే తీరు, గొంతులోని ప్రత్యేకతతో అందరికీ దగ్గర అవుతుంది.
ఆ తర్వాత సత్తిబాబు (రాగ్ మయూర్)తో కలిసి వారి బృందంలో చేరుతుంది. పాతకాలపు బుర్రకథ పద్ధతికి భిన్నంగా జానపద బాణీలు కలపడంతో లక్ష్మికి పేరు, డబ్బుతో పాటు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. సత్తిబాబుతో కలిసి ఓ కొత్త లైఫ్ మొదలుపెట్టాలనుకునే లోపే,ఆ ఊరి ప్రెసిడెంట్ కన్ను లక్ష్మిపై పడుతుంది. అతని కోరికను తిరస్కరించడంతో మొదలైన పగ లక్ష్మిని ఎక్కడికి లాక్కెళ్లింది? నమ్మి తోడు నిలబడతాడనుకున్న సత్తిబాబు వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సినీ ఇండస్ట్రీపై లక్ష్మికి ఎందుకు గురి పోయిందనేదే ఈ సినిమా అసలు కథ.
గెలుపు ఓటముల మధ్య సాగే జీవితంలో మనిషి ఎక్కడ బోల్తా పడతాడో ఈ చిత్రం స్పష్టంగా చూపిస్తుంది. కష్టపడే తత్వం ఉన్నా, నమ్మినవాళ్లు వెన్నుపోటు పొడిచినప్పుడే లైఫ్ తలకిందులవుతుంది. ఎవరికీ పెద్దగా తెలియని ఓ కళాకారిణి జీవితాన్ని వెలికి తీయడం ఈ బయోపిక్ స్పెషాలిటీ. ఫస్టాఫ్‌లో లక్ష్మి ఎదుగుదల, చదువు లేకపోవడం వల్ల ఎదురైన అవమానాలు, మొదటిలో ఎదురైన విమర్శలు చాలా ఫాస్టుగా సాగుతాయి. సెకండాఫ్‌లోకి వెళ్లేసరికి ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలు, నమ్మకద్రోహాలు, ఎమోషన్స్‌తో స్టోరీ బరువెక్కుతుంది.
బుర్రకథకు ముందు, ఆ తర్వాతగా కథను విభజించిన విధానం బాగుంది. ఫస్టాఫ్ అంతా జానపద సాంగ్స్‌తో జోరుగా సాగితే, సెకండాఫ్ కన్నీళ్లు, బాధలతో హార్ట్‌ను తాకుతుంది. పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ లొకేషన్లు కథలోని సహజత్వానికి ప్రాణం పోశాయి. లక్ష్మి పాత్రలో ఆనంది చాలా బాగా ఒదిగిపోయింది. స్టేజ్‌పై చురుకైన డ్యాన్స్‌లతో పాటు ఎమోషన్స్ సీన్లలోనూ మెప్పించింది.
రాశి, రాగ్ మయూర్, నరేశ్ తమ రోల్స్‌కు తగ్గట్టుగా చేశారు. ఆదిత్య ఫొటోగ్రఫీ, చరణ్ అర్జున్ మ్యూజిక్, రవితేజ ఎడిటింగ్ సినిమాకు బలాన్నిచ్చాయి. మధ్యలో స్టోరీ కాస్త నెమ్మదించినా వెంటనే పుంజుకోవడం వల్ల సాగదీత అనిపించదు. కమర్షియల్ హంగులకు పోకుండా నిజ జీవితానికి దగ్గరగా తీశారు. అయితే క్లైమాక్స్‌లో లక్ష్మి గౌరవం గురించి మాట్లాడుతూనే అసిస్టెంట్ డైరెక్టర్ ఆమెను ఏకవచనంతో పిలిచే సీన్.. ఇంకాస్త కేర్ చూపిస్తే బాగుండేది. మొత్తానికి ఒక నిజాయితీ గల బయోపిక్‌గా ఇది ఆడియన్స్‌కు చేరువవుతుంది.
Thiruparankundram : తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొండపైకి సీఆర్పీఎఫ్ బలగాలు





