Korean Kanakaraju : వరుణ్ తేజ్ ఓటీటీ రచ్చ .. నెట్‌ఫ్లిక్స్‌లో కొరియన్ కనకరాజుకు డేట్ ఫిక్స్
Korean Kanakaraju : కొరియన్ ఆత్మ కథేంటి? అది కనకరాజునే ఎందుకు టార్గెట్ చేసింది? ఈ దెయ్యం గోల మధ్యలో తన లవర్ చైత్రతో అనంతపురం కుర్రోడి లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అన్నది క్లైమాక్స్‌లో తెలుస్తుంది.
Korean Kanakaraju
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెగ్యులర్‌గా చేసే మాస్, యాక్షన్ సినిమాల రూట్ మార్చి, కొరియన్ దెయ్యంతో కాంబో సెట్ చేసి.. థియేటర్లలో ఫుల్ కామెడీ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఆల్రెడీ నవ్వుల పండుగ చేసుకున్న లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ.. కొరియన్ కనకరాజు(Korean Kanakaraju) ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతోంది.
డైరెక్టర్ మేర్లపాక గాంధీ తన పక్కా కామెడీ టైమింగ్‌తో చెక్కిన ఈ ఎంటర్టైన్మెంట్ విందు డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 7 వ తేదీన థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన ఈ మూవీ, రిలీజైన కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. వీకెండ్ వస్తే ఏ మూవీ చూడాలా అని వెతుక్కునే మూవీ లవర్స్‌కు ఇది నిజంగా ఒక అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి.
సెప్టెంబర్ 4 నుంచి కొరియన్ కనకరాజు సందడితో డిజిటల్ ధమాకా ప్రారంభం కానుంది. కేవలం తెలుగు ఆడియన్స్ కోసమే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజ్ ఆడియన్స్‌కు కూడా ఒకేసారి ఈ మూవీ అందుబాటులోకి రాబోతోంది.
ఇక ఈ స్టోరీలోకి వెళ్తే.. అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ క్రేజీ స్టోరీలో కనకరాజు (వరుణ్ తేజ్) లోకల్‌గా చెక్కభజనలు చేసుకుంటూ ఉండే ఒక పక్కా మాస్ కుర్రాడు. ముక్కుసూటిగా మాట్లాడుతూ చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకునే కనకరాజు.. ఎలాగైనా కొరియా వెళ్లాలనే డ్రీమ్‌తో బతుకుతున్న చైత్ర (రితికా నాయక్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా కూల్‌గా సాగిపోతోందనుకునే టైమ్‌లో కొరియా నుంచి వచ్చిన ఒక విచిత్రమైన వస్తువు వల్ల.. వీరి జీవితంలోకి ఊహించని ట్విస్ట్ వచ్చి పడుతుంది.

ఆ వస్తువు వల్ల ఒక కొరియన్ ఆత్మ వచ్చి కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక ఆ దెయ్యం ఎంటర్ అయ్యాక కనకరాజు లైఫ్ పూర్తిగా రివర్స్ అయిపోయి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. తనలో దూరిన ఆ ఆత్మ గోల భరించలేక, దాని నుంచి విముక్తి కోసం కనకరాజు తన గ్యాంగ్‌తో కలిసి ఏకంగా కొరియా ప్రయాణమవుతాడు.
అసలు ఆ కొరియన్ ఆత్మ కథేంటి? అది కనకరాజునే ఎందుకు టార్గెట్ చేసింది? ఈ దెయ్యం గోల మధ్యలో తన లవర్ చైత్రతో అనంతపురం కుర్రోడి లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అన్నదే క్లైమాక్స్. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ అనంతపురం కుర్రాడు చేసే కొరియన్ రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో స్ట్రీమ్ చేసి చూడాలంటే..సెప్టెంబర్ 4వ తేదీ కోసం క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి మరి.





