Just EntertainmentLatest News

Megastar Chiranjeevi : చిరుని స్ట్రెయిట్‌గా ఛాన్స్ అడిగిన బుచ్చిబాబు.. మెగాస్టార్ ఇచ్చిన రిప్లై మామూలుగా లేదంటున్న ఫ్యాన్స్

Megastar Chiranjeevi : బుచ్చిబాబు అడిగిన ఈ ప్రశ్నకు మెగాస్టార్ తనదైన స్టైల్లో చాలా ఫన్నీగా రియాక్టయ్యారు

Megastar Chiranjeevi

ఫస్ట్ టైమ్ ఉప్పెనతో డైరెక్టర్ బుచ్చిబాబు సానా నేషనల్ అవార్డ్ అందుకోవడమే కాకుండా.. వంద కోట్ల కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేశారు . ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌తో తీసిన పెద్ది మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అరాచకం క్రియేట్ చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం.

జూన్ 4న రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ. 370 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 400 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఏ హీరోతో తన తర్వాతి మూవీ చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర సుమారు పదేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు సానాకు మెగా ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. తను రాసుకున్న ఉప్పెన, పెద్ది స్టోరీలను షూటింగ్‌కు ముందే చిరంజీవికి చెప్పిన బుచ్చిబాబు..చిరు ఆశీర్వాదం తీసుకున్నారు.

కాగా పెద్ది మూవీ సాధించిన గ్రాండ్ సక్సెస్‌పై మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయిపోయారు. మూవీ యూనిట్‌ను ప్రత్యేకంగా తన ఇంటికి పిలిపించి మరీ వారిని గ్రాండ్‌గా సత్కరించారు. దీనికి సంబంధించిన ఒక క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

థియేటర్లలో పెద్ది కనకవర్షం కురిపిస్తుండటంతో బుచ్చిబాబును మెగాస్టార్ గట్టిగా హగ్ చేసుకుని అప్రిషియేట్ చేశారు. ఇదే సమయమనుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు మెగాస్టార్‌తో సరదాగా ముచ్చటిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ పెట్టారు. సార్.. మీరు ఛాన్స్ ఇస్తే మీతో కూడా ఒక మూవీ చేస్తాను. వైష్ణవ్ తేజ్‌తో ఉప్పెన, రామ్‌చరణ్‌తో పెద్ది చేశాను. ఇక మీతో చేయడమే బ్యాలెన్స్ ఉందంటూ ఓపెన్‌గానే ఛాన్స్ అడిగేశారు.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

బుచ్చిబాబు అడిగిన ఈ ప్రశ్నకు మెగాస్టార్ తనదైన స్టైల్లో చాలా ఫన్నీగా రియాక్టయ్యారు. నీ మూవీలో హీరోలను రకరకాల సాహసాలు చేయమని చెప్తావు. ఈ వయసులో నేను అంతగా పరిగెత్తలేను, సాహసాలు చేయలేను.. అందుకే నీతో సినిమా చేయడం నాకు కొంచెం కష్టమేనంటూ నవ్వుతూ సరదాగా కామెంట్ చేశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరు, బుచ్చిబాబు మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మెగాస్టార్ ఇప్పుడు నో అన్నా సరే, బుచ్చిబాబు చిరుకు తగ్గట్లు ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేస్తే.. ఫ్యూచర్‌లో వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Papikondalu : పాపికొండల విహారయాత్ర నిలిపివేత..బోటింగ్ బంద్ ఎందుకంటే?

Related Articles

Back to top button