Pradeep Rawat : తెరపై భయపెట్టే రాక్షసత్వం.. రియల్ లైఫ్‌లో అద్భుత నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
Pradeep Rawat : కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్, ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Pradeep Rawat
సిల్వర్ స్క్రీన్‌పై ఆయన కనిపిస్తే చాలు.. థియేటర్లలో ఒక రకమైన నిశ్శబ్దం, తెలీకుండానే ఒకలాంటటి భయం ఆవహించేవి. కళ్లలోని రౌద్రంతో, గంభీరమైన మాట తీరుతో దశాబ్దాల పాటు ఇండియన్ మూవీ ఇండస్ట్రీని ఏలిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్(Pradeep Rawat) (74)మంగళవారం కన్నుమూశారు.
కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్(Pradeep Rawat), ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1952 జనవరి 21వ తేదీన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పుట్టిన ప్రదీప్, ఐకానిక్ బి.ఆర్.చోప్రా మహాభారత్ సీరియల్‌లో అశ్వత్థామగా తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా ఎన్నో భాషల్లో వందలాది వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు.
తెలుగు ఆడియన్స్‌కు ప్రదీప్ రావత్ కేవలం ఒక యాక్టర్ మాత్రమే కాదు.. ఒక సరికొత్త విలనిజానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ముద్ర వేసుకున్నారు. 2004లో ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన సై సినిమాలో ప్రదీప్ రావత్ చేసిన ‘బిక్షూ యాదవ్’ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఆ రోల్‌లో ఆయన ఒదిగిపోయిన తీరుకి సౌత్ ఇండియా మొత్తం ఫిదా అయిపోవడమే కాదు.. ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది.
ఆ వెంటనే గజిని సినిమాలో ప్రదీప్ రోల్‌కు దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మార్చేసింది. ఛత్రపతిలో రాజ్ బిహారిగా, భద్ర, దేశముదురు, స్టాలిన్, ఓయ్ వంటి చిత్రాల్లో ఆయన పండించిన నెగెటివ్ షేడ్స్ తెలుగు మూవీ తెరమీద సరికొత్త గ్లామర్‌ను తెచ్చిపెట్టాయి.

ప్రదీప్ రావత్‌ను కేవలం భయంకరమైన విలన్‌గానే చూసిన ఆడియన్స్..నేను శైలజ మూవీలో ఆయన చేసిన కామెడీ టైమింగ్ చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు. హాస్యాన్ని కూడా చాలా ఈజీగా పండించగలరని ఆ మూవీతో ప్రూవ్ చేసుకున్నారు.
తెర వెనుక ఎంతో ప్రశాంతంగా, అందరితోనూ ఆప్యాయంగా ఉండే ప్రదీప్ రావత్ ఇలా అర్ధాంతరంగా దూరం అవడం.. సినీ లోకానికి తీరని లోటు. ప్రదీప్ రావత్ పోషించిన బిక్షూ యాదవ్, గజిని, రాజ్ బిహారి లాంటి పాత్రల రూపంలో ఆయన ఎప్పటికీ ఆడియన్స్ మధ్యనే జీవించి ఉంటారు.
Trisha : త్రిష పొలిటికల్ ఎంట్రీ ?.. మధురైలో పోస్టర్లు అదే కన్ఫమ్ చేస్తున్నాయా?





