Peddi : రామ్ చరణ్ పెద్ది సెన్సార్ టాక్ అవుట్..చివరి 45 నిమిషాలు ఎమోషనల్ పీక్స్
Peddi: రీసెంట్గా పూర్తయిన సెన్సార్ టాక్ వింటే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం గ్యారంటీ అన్పిస్తుంది.
Peddi
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్-ఇండియా మూవీ పెద్ది(Peddi) సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ మళ్లీ పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ డ్రామా కావడం.. దీనికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడంతో ఈ(Peddi )మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
టాలీవుడ్లో కొన్ని నెలలుగా సరైన బ్లాక్‌బస్టర్ లేక థియేటర్లు వెలవెలబోతుండటంతో, ట్రేడ్ వర్గాలతో పాటు బయ్యర్స్ అందరూ బాక్సాఫీస్ కరవును తీర్చడానికి వస్తున్న పెద్ది మూవీపైనే తమ ఆశలన్నీ పెట్టుకున్నారు.
మరో రెండు వారాల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇటీవల రిలీజయిన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ట్రైలర్‌పై సోషల్ మీడియాలో కొంత భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనా, రీసెంట్గా పూర్తయిన సెన్సార్ టాక్ వింటే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం గ్యారంటీ అన్పిస్తుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

అయితే సెన్సార్ సభ్యుల ఇన్సైడ్ టాక్ ప్రకారం.. 3 గంటల 2 నిమిషాల డ్యురేషన్ గల ఈ మూవీలో బుచ్చిబాబు, చెర్రీని నటుడిగా సరికొత్త శిఖరాలకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మూవీ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, గూస్బంప్స్ ఇచ్చే సీన్లతో సాగుతుంది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లోని చివరి 45 నిమిషాల ఎమోషనల్ ఎపిసోడ్లో చరణ్ యాక్షన్ ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తుందని, జగపతి బాబు పాత్ర కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సమాచారం. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రంగస్థలం రికార్డులను తిరగరాస్తూ రూ.1000 కోట్ల క్లబ్లో చేరడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. దీంతో ఈ న్యూస్ తెలిసి మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుత అవకాశం.. స్వామివారికి కానుకగా వచ్చిన వస్త్రాల వేలం..





