Peddi Review : పెద్ది ఫస్ట్ రివ్యూ టాక్.. రామ్ చరణ్ నాన్-స్టాప్ బాక్సాఫీస్ రచ్చ
Peddi Review : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు, మెగాభిమానులకు ఈ మూవీకి ఫుల్ మీల్స్ లాంటిదే. కానీ కామన్ ఆడియన్స్ పెద్దిలోని ఎమోషన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతాయనే దానిపైనే మూవీ రేంజ్ ఆధారపడి ఉంటుంది
Peddi Review
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో పెద్ద జాతర మొదలుకాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దద్దరిల్లబోతోంది. అయితే అధికారికంగా రిలీజ్ అవ్వడానికి ముందే, ఈరోజు రాత్రి పడబోయే స్పెషల్ ప్రీమియర్స్ కంటే ముందే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ(Peddi Review) టాక్ బయటకు వచ్చేసింది.
సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు, ఓవర్సీస్ బయ్యర్లు ఇప్పటికే ఈ మూవీని చూసేయడంతో ఇండస్ట్రీ సర్కిల్స్ లో పెద్ది మూవీ రిపోర్ట్(Peddi Review) గట్టిగా వినపడుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై.. కిలారు వెంకట సతీష్ నిర్మించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేయగా.. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ లాంటి స్టార్స్ కీ రోల్స్ పోషించారు.
ఇక అసలు విషయానికొస్తే.. సెన్సార్ టాక్, ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం మూవీ ఫస్ట్ హాఫ్ చాలా పవర్‌ఫుల్‌గా సాగుతుంది. ఫుల్ మాస్ ఎలిమెంట్స్, మంచి కామెడీ, అలాగే జాన్వీ కపూర్ గ్లామర్ షోతో ఫస్ట్ పార్ట్ ఫాస్ట్ ఫాస్ట్‌గా నడుస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్‌పై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని టాక్ వినిపిస్తోంది.
సెకండ్ హాఫ్ మాత్రం కథ డిమాండ్ మేరకు ఎమోషనల్ సీన్స్‌తో సాగుతుందట. కానీ క్లైమాక్స్‌లో వచ్చే ఉత్కంఠభరితమైన రన్నింగ్ సీన్స్ మాత్రం ఆడియన్స్‌కు థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని తెలుస్తోంది.
ఈ సినిమా స్టోరీ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందట. విజయనగరం పరిసరాల్లోని ఒక కొండ ప్రాంతానికి చెందిన పెద్ది , అతని మనుషులు ఆటల్లో చాలా ఎక్స్పర్ట్స్. అయితే వీరి ట్యాలెంట్‌ను వాడుకుని కొందరు స్వార్థపరులు వీళ్లను ఆట కూలీలుగా మార్చి బెట్టింగ్స్ ద్వారా బాగా సంపాదిస్తుంటారు.
తమ పొట్టకూటి కోసం ప్రాణాలకు తెగించి ఆడే ఈ ఆటగాళ్లందరికీ హీరో పెద్ది లీడర్‌గా ఉంటాడు. సినిమాలో చరణ్ ఎంట్రీ క్రేజీ క్రికెట్ మ్యాచ్ , ఫైట్ సీన్‌తో అదిరిపోయే రేంజ్లో ఉంటుందట. అయితే తమ ఊరి ఆటగాళ్లపై జరుగుతున్న వివక్ష, ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోవడం వంటి రీజన్స్‌తో ఆట కూలిగా ఉండే పెద్ది సొసైటీపై ఎదురుతిరుగుతాడు.
ఈ క్రికెట్, కుస్తీ పోరాటాల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్‌తోనే ఇంటర్వెల్ బ్రేక్ పడుతుందట. ఆ తర్వాత తన మనుషుల న్యాయం కోసం, ఊరి గుర్తింపు కోసం పెద్ది ఢిల్లీ వెళ్లడంతో.. అక్కడ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ జర్నీలా నడుస్తుందని టాక్ నడుస్తోంది.
సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్ల విషయానికొస్తే.. రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, కుస్తీ, క్రికెట్ , రన్నింగ్ సీన్స్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్‌లా నిలిచాయట. ముఖ్యంగా అప్పల సూరి పాత్రలో విలనిజం పండించిన జగపతి బాబు యాక్షన్ సినిమాకే పెద్ద హైలైట్ అని చెబుతున్నారు.

బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ తన రోల్‌కు న్యాయం చేయగా.. హీరోయిన్ జాన్వీ కపూర్ మాత్రం కొన్ని సీన్లలో కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుందట. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోవడం, స్క్రీన్ ప్లే చాలా సింపుల్‌గా, రెగ్యులర్‌గా సాగడం చిన్న మైనస్ అని టాక్. సినిమాటోగ్రఫీ , విజువల్స్ మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయట.. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మేకర్స్ ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఓవరాల్‌గా రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు, మెగాభిమానులకు ఈ మూవీకి ఫుల్ మీల్స్ లాంటిదే. కానీ కామన్ ఆడియన్స్‌కు పెద్దిలోని ఎమోషన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతాయనే దానిపైనే మూవీ రేంజ్ ఆధారపడి ఉంటుంది.
Pawan Kalyan : పవన్ ఎంట్రీ వెనుక పెద్ద ప్లానే..ఇదంతా మోదీ వ్యూహమేనా ?





