Just EntertainmentLatest News

Ramya Krishnan : కృష్ణవంశీతో డైవోర్స్‌పై రమ్యకృష్ణ క్లారిటీ. మేం కలిసే ఉన్నాం కానీ..

Ramya Krishnan : డైరెక్టర్ కృష్ణవంశీతో డైవోర్స్ తీసుకున్నారంటూ వస్తున్న రూమర్స్‌కు నటి రమ్యకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె తమ మ్యారీడ్ లైఫ్‌ గురించి, తాము వేర్వేరుగా ఉండటానికి గల కారణాలను వివరించారు.

Ramya Krishnan

తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడని నటి రమ్యకృష్ణ, తాజాగా ఓ ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన పర్సనల్ అండ్ సినీ లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.

మెయిన్‌గా డైరెక్టర్ కృష్ణవంశీతో తాను డైవోర్స్ తీసుకున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న రూమర్లకు ఆమె ఎండ్ కార్డ్ వేశారు. తాము ఇప్పటికీ దంపతులమేనని, విడిపోలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే కెరీర్ బాధ్యతలు, కుమారుడి చదువు వల్ల హైదరాబాద్, చెన్నైలలో వేర్వేరుగా ఉండాల్సి వస్తోందని అన్నారు. తమ కొడుకు చిన్నతనంలో పదే పదే జర్నీలు చేయడం వల్ల హెల్త్ పాడయ్యేదని అందుకే ఇద్దరం చర్చించుకునే చెన్నైలోనే చదివించాలని డిసైడ్ అయ్యామని చెప్పారు.

అనవసరమైన గొడవలు పడటం కంటే మంచి ఫ్రెండ్స్‌లా ఉండడమే తమకు ప్రశాంతతను ఇస్తోందని, నిజానికి మ్యారేజ్ కన్నా లివింగ్ టుగెదర్‌గా ఉంటే బాగుండేదని కృష్ణవంశీ అప్పట్లోనే సరదాగా అన్నారని..దానికి కమిట్ అయినా బాగుండేదేమో అంటూ రమ్యకృష్ణ(Ramya Krishnan) నవ్వుతూ ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు.

అలాగే తన నటనా ప్రస్థానాన్ని గురించి మాట్లాడిన రమ్యకృష్ణ.. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చానని చెప్పుకొచ్చారు. తమిళంలో వై.జి. మహేంద్రన్ అనే కమెడియన్ పక్కన ‘వెల్లై మనసు’ మూవీ ద్వారా హీరోయిన్‌గా సినీ కెరీర్ ప్రారంభించానని, ఒక హీరోయిన్ ఎలా కెరీర్ మొదలుపెట్టకూడదో అలా తాను అడుగుపెట్టానంటూ జోక్ చేశారు. భరతనాట్యం ఫొటోలు చూసి భారతీరాజా, టి.రాజేంద్ర వంటి పెద్ద డైరెక్టర్స్ అవకాశాలు ఇచ్చినా కూడా, డేట్స్ కుదరక ఆ ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘అమ్మోరు’ సినిమా టైమ్‌లో అనుభవాలను గుర్తు చేసుకున్న రమ్యకృష్ణ, ఆ రోజుల్లో పడిన కష్టం వర్ణనాతీతమని చెప్పారు. అప్పట్లో ఇప్పటిలా గ్రాఫిక్స్ టెక్నాలజీ లేకపోవడంతో లండన్ నుంచి స్పెషల్‌గా బ్లూ కలర్ మేకప్ తెప్పించేవారని, పది చేతులతో అమ్మవారి రూపం కోసం రోజంతా ఒకే చోట కదలకుండా కర్రలకు కట్టేసి ఉంచేవారని చెప్పుకొచ్చారు.

బరువైన ఆయుధాలను చేతుల్లో పట్టుకుని గంటలకు గంటలు నిలబడి వర్క్ చేయాల్సి వచ్చేదని, కనీసం వాష్ రూమ్‌కు వెళ్లడానికి కూడా వీలుండేది కాదని ఆనాటి కష్టాలను రమ్యకృష్ణ మరోసారి గుర్తు చేసుకున్నారు. కార్‌వ్యాన్లు కూడా లేని ఆ రోజుల్లో తాము పడిన కష్టంతో పోలిస్తే, ఇప్పుడు యాక్టర్లు పడే కష్టం పావువంతు కూడా ఉండదన్నారు.

అల్లుడా మజాకా, అల్లరి ప్రియుడు వంటి కమర్షియల్ మూవీలు చేస్తున్న ఆ సమయంలోనే అమ్మోరు సినిమాను కూడా పూర్తి చేసినట్లు రమ్యకృష్ణ(Ramya Krishnan) చెప్పారు.కాగా 2003లో కృష్ణవంశీని వివాహం చేసుకున్న ఈ జంటకు 21 ఏళ్ల వయస్సున్న రిత్విక్ వంశీ అనే కొడుకు ఉన్నాడు.

Mitchell Santner : కివీస్ గడ్డపై 3-1 తేడాతో వన్డే సిరీస్‌ భారత్ కైవసం..అందుకే ఓడిపోయామని ఒప్పుకున్న మిచెల్ సాంట్నర్

Related Articles

Back to top button