Just EntertainmentLatest News

Ranabaali Trailer : అంచనాలను పెంచేసిన రణబాలి ట్రైలర్.. అక్టోబర్ 16న థియేటర్లలోకి విజయ్, రష్మిక

Ranabaali Trailer : విజయ్ దేవరకొండ శింగనమల బొబ్బిలి రణబాలి అనే వెరీ పవర్‌ఫుల్ పాత్రలో జీవించగా, ఆయన భార్య జయమ్మ రోల్‌లో రష్మిక మందన్న యాక్షన్ హైలైట్‌గా నిలిచింది.

Ranabaali Trailer

టాలీవుడ్ క్యూట్ అండ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్.. సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తేనే చాలు ఆ క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటిది వీరిద్దరూ పెళ్లి పీటలెక్కి రియల్ లైఫ్‌లో కూడా పెయిర్‌గా మారిన తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్న ఫస్ట్ ఫిల్మ్ కావడంతో రణబాలిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

తాజాగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి గురువారం రిలీజైన ట్రైలర్(Ranabaali Trailer) ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్, యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నయా రికార్డులను తిరగరాస్తోంది. ప్రతీ సెకన్ గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్, నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ , మైండ్ బ్లాకింగ్ యాక్షన్ సీక్వెన్సులతో ట్రైలర్(Ranabaali Trailer) కట్ చేసిన తీరు ..మూవీపై హైప్‌ను ఆకాశానికి తీసుకెళ్లింది.

ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, 1854 నుంచి 1878 కాలం నాటి రాయలసీమ ఏరియాలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనలను బేస్ చేసుకుని రూపొందించారు. బ్రిటిష్ దురాగతాలకు, వారి దమననీతికి వ్యతిరేకంగా గొంతెత్తి పోరాడిన ఒక వీరుడి పోరాట గాథ.. రణబాలిగా తెరకెక్కింది.

దీనిలో విజయ్ దేవరకొండ శింగనమల బొబ్బిలి రణబాలి అనే వెరీ పవర్‌ఫుల్ పాత్రలో జీవించగా, ఆయన భార్య జయమ్మ రోల్‌లో రష్మిక మందన్న యాక్షన్ హైలైట్‌గా నిలిచింది. ఈ పిక్చర్‌లో ఇంగ్లీష్ అధికారి ప్రతాపానికి సరితూగేలా హాలీవుడ్ ఫేమస్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ నెగెటివ్ షేడ్ ఉన్న బ్రిటిష్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

టోటల్ 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి. పోరాట ఘట్టాలలో రౌడీ బోయ్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి.

Ranabaali Trailer
Ranabaali Trailer

ఇప్పటి వరకూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి బ్లాక్‌ బస్టర్ హిట్స్ తర్వాత ఈ క్యూట్ కపుల్ కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

మైత్రీ మూవీ మేకర్స్ , టీ-సిరీస్ కంబైన్డ్‌గా నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ విజువల్ వండర్‌కు అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌(Ranabaali Trailer)ను వేరే రేంజ్‌కి తీసుకెళ్లింది. ఈ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌ను విజయదశమి కానుకగా అక్టోబర్ 16న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేశారు.

Ranabaali : రణబాలి మూవీ క్రేజీ అప్‌డేట్.. విజయ్ దేవరకొండ ఖాతాలో అరుదైన రికార్డ్..

Related Articles

Back to top button