Samantha : బేబీ బంప్‌తో సమంత క్యూట్ పిక్స్ ..కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ క్రేజీ కామెంట్..
Samantha :జస్ట్ అస్ అంటూ క్లాక్, బేబీ ఎమోజీలతో సామ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు.. ఆమె క్లోజ్ ఫ్రెండ్ క్రేషా బజాజ్ కౌంట్‌డౌన్ మొదలైందని కామెంట్ చేశారు.
Samantha
గ్లామర్ ప్రపంచంలో తన యాక్టింగ్‌తో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న నటి సమంత రూత్ ప్రభు ఇప్పుడు తన లైఫ్‌లో అత్యంత మధురమైన ఘట్టాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే సామ్ మాతృత్వపు తీపిని చవిచూడబోతుండటంతో సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకుంటున్న ప్రతీ అప్‌డేట్.. నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
తన భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలసి ప్రస్తుతం సరదాగా హాలిడే ట్రిప్‌లో ఉన్న సమంతా.. ప్రెగ్నెన్సీ గ్లోతో క్లియర్‌గా కనిపిస్తున్న బేబీ బంప్‌ను చూపిస్తూ పిక్స్ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.
ఈ వెకేషన్‌లో ఈ క్యూట్ పెయిర్ హ్యాపీగా గడుపుతూ రకరకాల టేస్టీ ఫుడ్స్‌ను రుచి చూడటం, షాపింగ్ చేయడం, కాఫీ డేట్స్‌కు వెళ్లడం, పికిల్‌బాల్ ఆడడం వంటి మూమెంట్స్‌ను సామ్ క్యాప్చర్ చేసి పోస్ట్ చేశారు.
జస్ట్ అస్ అంటూ క్లాక్, బేబీ ఎమోజీలతో సామ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు.. ఆమె క్లోజ్ ఫ్రెండ్ క్రేషా బజాజ్ కౌంట్‌డౌన్ మొదలైందని కామెంట్ చేయడంతో డెలివరీ డేట్ చాలా దగ్గరలోనే ఉందనే విషయం అర్ధం అవుతుంది. దీంతో సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా ఈ కపుల్‌కు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

నిజానికి సమంత(Samantha) తన ప్రెగ్నెన్సీ వార్తను ఈ ఏడాది జూలైలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన తన ప్రొడ్యూస్డ్ మూవీ మా ఇంటి బంగారం సక్సెస్ మీట్‌లో మాట్లాడిన సామ్..కొంతకాలం మూవీల నుంచి చిన్న గ్యాప్ తీసుకోబోతున్నానని అన్నారు. ఈ టైమ్‌లో మెటర్నిటీ లీవ్ తీసుకోవడం చాలా అవసరమని తెలుసని.. తాను ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నానని చెబుతూ టెంపరరీగా షూటింగ్స్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
సమంత(Samantha), రాజ్ నిడిమోరుల మ్యారేజ్ 2025లో గ్రాండ్‌గా జరిగింది. వీరిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. సమంత అంతకుముందు నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకుని, కొన్ని విబేధాలతో 2021లో విడిపోగా.. రాజ్ నిడిమోరుకు కూడా గతంలో శ్యామలి దేతో వివాహమైంది.
View this post on Instagram
WTC Final : లంక గడ్డపై టీమిండియా చారిత్రక విజయం..అయినా WTC ఫైనల్ చేరడం ఈజీ కాదా?





