Samantha : నెన్త్ మంత్లోనూ వర్కవుట్స్‌తో అదరగొడుతున్న సామ్
Samantha : నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీతోనూ డంబెల్ స్క్వాట్స్ చేస్తూ అదరగొడుతున్న సమంత ఫిట్నెస్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Samantha
టాలీవుడ్ నుంచి గ్లోబల్ లెవెల్ దాకా తన గ్లామర్‌తో, యాక్టింగ్‌తో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న సమంత.. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ జర్నీతో నెట్టింట కూడా క్యూట్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ప్రజెంట్ తన ప్రెగ్నెన్సీలో లాస్ట్ లాప్ ఎంజాయ్ చేస్తున్న సమంత, త్వరలోనే పండంటి బిడ్డకు మమ్మీగా ప్రమోషన్ తీసుకోబోతోందన్న విషయం తెలిసిందే. బేబీ బంప్‌తో ఉన్నా కూడా ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది ఈ బ్యూటీ.
తాజాగా నైన్త్ మంత్లోకి అడుగుపెట్టిన సమంత(Samantha).. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు తాను చేసిన వర్కౌట్లతో ఒక కిక్కిచ్చే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. #9. ది ఫైనల్ ల్యాప్ అంటూ సామ్ పోస్ట్ చేసిన ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.
ఆ వీడియోలో సామ్ డెడికేషన్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఏకంగా తొమ్మిదో నెల బేబీ బంప్‌తో కూడా బరువైన డంబెల్ పట్టుకుని పర్ఫెక్ట్గా వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తున్న వర్కౌట్లు చూసి యూత్ కంగుతింటున్నారు. ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు తనలో వచ్చిన ప్రతీ చేంజ్ని ఈ వీడియోలో ఫుల్‌గా కవర్ చేసింది.
ఈ టైమ్‌లో ట్రెయినింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుందని.. ఎక్స్ట్రాగా శరీరాన్ని ఇబ్బంది పెట్టడం కంటే, మన బాడీ చెప్పే సిగ్నల్స్ వినడమే ఇంపార్టెంట్ అని అదిరిపోయే ఫిట్నెస్ టిప్ కూడా సామ్ ఇచ్చింది. రాజ్ నిడిమోరుతో ఫుల్ హ్యాపీగా ఉన్న సమంత..తన భర్తతో కలిసి తమ ఫస్ట్ బేబీ వెల్కమ్కు రెడీ అవుతున్నారు. సామ్ ఈ రేంజ్లో ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తుండటంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
View this post on Instagram
Passive Resistance : చెప్పినవన్నీ చేస్తామంటారు..కానీ నచ్చిందే చేస్తారు.. మీరూ అదే టైపా?





