Star Heros : ఫ్యాన్స్ కోసం రిస్క్ చేస్తున్న రియల్ హీరోలు.. డెడికేషన్‌తో ఆపరేషన్ థియేటర్ మెట్లెక్కుతున్న స్టార్స్
Star Heros : ఇది నా హీరో నిజంగానే చేశాడని థియేటర్లో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే ఆ ఒక్క మాట కోసం.. హీరోలు తమ శరీరానికి అయ్యే గాయాలను కూడా గౌరవ చిహ్నాలుగానే భావిస్తున్నారు.
Star Heros
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం యాక్షన్ మాత్రమే. కానీ ఇప్పుడు తమ హీరోలపై ఆడియన్స్ అంచనాలు ఆకాశానికి టచ్ అవుతున్నాయి. అందుకే తమను ప్రాణంగా ఇష్టపడే ఫ్యాన్స్ కోసం డేంజరస్ స్టంట్స్‌ను కూడా డూప్ లేకుండానే చేస్తూ.. ఇప్పటి హీరోలు తమ శరీరాలను గాయాల పాలు చేసుకుంటున్నారు . ఆ గాయాలు చిన్నపాటి నొప్పులతోనే సరిపెట్టడం లేదు, ఆ హీరోలను ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకెళ్లేలా చేస్తున్నాయి.
ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మణికట్టుకు సర్జరీ న్యూస్‌తో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇటీవల థియేటర్లలో రిలీజై, ఓటీటీలోనూ అదరగొడుతున్న పెద్ది మూవీ షూటింగ్ సమయంలో చెర్రీ పడ్డ కష్టం, తీసుకున్న రిస్క్.. ఈరోజు చరణ్‌ను సర్జరీ వరకూ తీసుకుని వెళ్లాయి. పెద్ది మూవీలోని చాలా టఫ్ యాక్షన్ అండ్ కుస్తీ సీన్స్‌లో ఉండగా రామ్ చరణ్ మణికట్టు వద్ద ఉన్న కార్టిలేజ్(Cartilage Tear) బాగా దెబ్బతింది .
అంతేకాకుండా కంటి భాగంలో కూడా గాయాలయ్యాయి. తీవ్రమైన నొప్పితో బాధపడినా.. స్క్రీన్ మీద ఆన్-స్క్రీన్ రియలిజం, ఎమోషన్ తగ్గకూడదనే పట్టుదలతో చెర్రీ ఆ షూటింగ్ కంప్లీట్ చేశారు. మగధీర సమయం నుంచే గుర్రపు స్వారీలలో లిగమెంట్ గాయాలు కావడం, ఆ తర్వాత RRR, గేమ్ ఛేంజర్ షూటింగ్ టైమ్‌లో చిన్న చిన్న గాయాలయినా కూడా చరణ్.. పెద్ది సినిమాలోనూ అదే డెడికేషన్ కంటిన్యూ చేశారు.
మరోవైపు రీసెంట్గా కాకినాడలో తన NBK111 మూవీ షూటింగ్లో యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న బాలకృష్ణ మోకాలికి తీవ్ర గాయమైంది. తాజాగా దానికి హైదరాబాద్‌లో చిన్నపాటి సర్జరీ కూడా జరిగింది. ఆ వయసులోనూ ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్లాల్సి వచ్చినా ఫ్యాన్స్ ఆనందం కోసమే బాలయ్య కూడా తాపత్రయపడ్డారు.
అలాగే గబ్బర్ సింగ్ షూటింగ్ సమయం నుంచి భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, రొటేటర్ కఫ్ దెబ్బతినడంతో ఒక భుజానికి రీసెంట్గా సర్జరీ చేయించుకున్నారు. మరో భుజానికి ఇంకా చేయించుకోవాల్సి ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే షూటింగ్ సమయాలలో ఎన్నిసార్లు గాయాలపాలయ్యి సర్జరీ చేయించుకున్నారో ఆయనకే తెలియదనే విధంగా రిస్క్ చేశారు. అలాగే బాహుబలి కోసం భుజం, మోకాలి ఆపరేషన్లు చేయించుకున్న డార్లింగ్ ప్రభాస్, దెబ్బలు తగిలినా షూటింగ్ ఆపకుండా షూటింగ్ కంప్లీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు వరకు ప్రతీ ఒక్కరి టార్గెట్ ఒక్కటే.. తమను నమ్మిన ఫ్యాన్ ఏమాత్రం తమను సిల్వర్ స్క్రీన్‌పై చూసి నిరాశ పడకూడదు అనే అనుకుంటున్నారు.

పాత తరం సినిమాల్లో హీరోలు(Star Heros) వారి సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇస్తూ డూప్‌లు, కెమెరా ట్రిక్స్‌తో సీన్లు నడిపించేవారు. కానీ చిరంజీవి వెండితెరపైకి వచ్చాక ఆ ట్రెండ్‌కు దాదాపు ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇది నా హీరో నిజంగానే చేశాడని థియేటర్లో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే ఆ ఒక్క మాట కోసం.. హీరోలు తమ శరీరానికి అయ్యే గాయాలను కూడా గౌరవ చిహ్నాలుగానే భావిస్తున్నారు. ఎంత పెద్ద నొప్పిని అయినా నవ్వుతూ భరిస్తూ, సర్జరీలు చేయించుకుని మరీ మళ్లీ కెమెరా ముందుకు వచ్చి నిలబడుతున్నారు.
అయితే ఇది కేవలం వారి డెడికేషన్ మాత్రమే కాదు, తమను ఆరాధించే కోట్ల మంది ఫ్యాన్స్ పట్ల వారికున్న ప్రేమ అనే చెప్పొచ్చు. ఆన్-స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ వెనుక వారి బ్లడ్, చెమట, కన్నీళ్లు ఉన్నాయనేది మాత్రం పచ్చి నిజం. అందుకే, స్క్రీన్‌పై హీరోల స్టంట్స్ చూసి మనం కొట్టే క్లాప్స్ మాత్రమే కాదు..ఆ సీన్ వెనుకున్న వారి త్యాగానికి, కష్టానికి కూడా మనం గౌరవం ఇవ్వాలి.





