Toxic Movie Review : రాకింగ్ స్టార్ టాక్సిక్ మూవీ రివ్యూ..యాక్షన్ అండ్ ఎమోషన్ల విజువల్ వండర్ మెప్పించిందా?
Toxic Movie Review : హీరో యశ్ డ్యూయల్ రోల్లో యాక్షన్‌తో నెక్ట్స్ లెవల్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ.. ఒకవైపు గంభీరమైన రౌడీగా, మరోవైపు ఎమోషనల్ కొడుకుగా వేరియేషన్స్ చూపించారు.
Toxic Movie Review
బాక్సాఫీస్ దగ్గర మాస్ వేవ్ అంటే ఏంటో చూపిస్తానంటూ వచ్చిన రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా టాక్సిక్ థియేటర్లలోకి వచ్చి రచ్చ చేస్తోంది. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో వెంకట్ కె. నారాయణ, యశ్ స్వయంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి.
ఇది 1947 నాటి గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్టోరీ. సాల్వడార్ అనే మాఫియా బాస్ దగ్గర పనిచేసే రాయ్.. తన చెల్లెలు గంగతో కలిసి అక్రమ దందాల్లో తిరుగులేని పెత్తనం చెలాయిస్తుంటాడు. ఇలా సాల్వడార్ తన కూతురు రెబెక్కాను.. రాయ్‌కి ఇచ్చి మ్యారేజ్ చేస్తాడు. కానీ రాయ్ మాత్రం సర్కస్‌లో పని చేసే నాదియాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. వీరిద్దరికీ ఒక బాబు కూడా పుడతాడు.
కొన్ని అనుకోని కారణాల వల్ల నాదియాకు రాయ్ దూరమవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత కాలంలో జరిగిన కొన్ని సర్ప్రైజింగ్ పరిణామాలతో.. తన సొంత కొడుకైన టికెట్‌కు.. రాయ్ ఎదురుపడాల్సి వస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది, ఆ తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి యుద్ధం నడిచిందనేది మిగతా ఇంట్రస్టింగ్ ప్లాట్.
డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేసిన స్టైల్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌లోనే ఏదో హడావుడిగా యాక్షన్ సీన్స్ పెట్టేయకుండా, అసలు ఆ మాఫియా నెట్వర్క్ ఏంటి, క్యారెక్టర్ల మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిది అనేది ఎంతో పేషన్స్‌తో డీటెయిల్డ్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. దీని వల్ల స్టోరీ మెల్లగా సాగుతుందా అన్న ఫీలింగ్ ఆడియన్స్‌లో వస్తుంది.
అలా నెమ్మదిగా మనల్ని కథలోకి తీసుకెళ్లి, ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్‌తో విపరీతమైన హైప్ పెంచారు. ఇక సెకండాఫ్ మొదలయ్యాక సినిమా కాస్త స్పీడందుకుంటుంది. అంత రఫ్‌గా ఉన్నా కూడా బంధాలు, లవ్, నమ్మకం లాంటి ఎమోషన్లను ఎక్కడా మిస్ చేయలేదు. ప్రతి యాక్షన్ సీన్ వెనుక ఒక జస్టిఫికేషన్, పెయిన్ ఉండేలా కేర్ తీసుకున్నారు. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఊహించే రూట్‌కి పూర్తి ఆపోజిట్లో ముగింపు ఇచ్చి థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా సినిమా గురించే ఆలోచించేలా ఉంటుంది.

హీరో యశ్ డ్యూయల్ రోల్లో యాక్షన్‌తో నెక్ట్స్ లెవల్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ.. ఒకవైపు గంభీరమైన రౌడీగా, మరోవైపు ఎమోషనల్ కొడుకుగా వేరియేషన్స్ చూపించారు. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్‌ను తన ఎక్స్‌ప్రెషన్స్‌తో పర్ఫెక్ట్గానే ప్రెజెంట్ చేశారు. నయనతార, కియారా అద్వాణీ, తారా సుతారియా తమ రోల్స్‌లో సినిమాకి మెయిన్ పిల్లర్స్‌గా నిలిచారు. ఇక హ్యూమా ఖురేషీ రోల్ ప్రతీ ఒక్కరినీ సర్ప్రైజ్ చేస్తుంది.
టెక్నికల్ సైడ్ చూస్తే దర్శకురాలి ఆలోచనా విధానం చాలా క్లాస్‌గా ఉంది. ఒక డిఫరెంట్ ఎక్స్పరిమెంట్ చేస్తూనే ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకున్నారు. నిర్మాతలు పెట్టిన ప్రతీ రూపాయి బిగ్ స్క్రీన్‌పై చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. విజువల్స్, భారీ సెట్టింగ్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే టాక్సిక్ స్లో పేస్‌లో సాగే ఒక సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు.
Toxic : బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ విధ్వంసం..ధురంధర్ 2 రికార్డ్‌ను వెనక్కి నెట్టిన యశ్





