Just EntertainmentLatest News

Trisha : జారాపై గుర్రుమన్న త్రిష..బ్రాండెడ్ షాపింగ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ మీరూ ఫేస్ చేశారా?

Trisha : త్రిషకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురుకావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది కేవలం త్రిష విషయంలోనే జరగడం లేదు. లక్షలాది మంది ఆన్‌లైన్ కస్టమర్లు ఇటువంటి సమస్యలను రెగ్యులర్‌గా ఎదుర్కొంటున్నారు.

Trisha

ఆన్‌లైన్ షాపింగ్‌ సామాన్యులకే కాదు, సెలబ్రెటీలకు కూడా చేదు అనుభవాలను మిగులుస్తుంది. ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీల నుంచి ఆర్డర్ చేసినా క్వాలిటీ విషయంలో కంగుతినాల్సి వస్తోంది. స్టార్ హీరోయిన్ త్రిషకు ఎదురైన అనుభవమే దీనికి నిదర్శనం. ప్రముఖ దుస్తుల బ్రాండ్ ‘జారా’ సర్వీస్‌పై త్రిష(Trisha) అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వరుసగా 3 సార్లు త్రిష జారా బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసిన క్లాత్స్ తీవ్రమైన దుర్వాసనతో వచ్చాయట. ప్యాకింగ్ చేసే ముందైనా కనీసం చెక్ చేసుకోవాలి కదా అంటూ త్రిష గట్టిగానే నిలదీసింది.

త్రిషకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురుకావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది కేవలం త్రిష(Trisha) విషయంలోనే జరగడం లేదు. లక్షలాది మంది ఆన్‌లైన్ కస్టమర్లు ఇటువంటి సమస్యలను రెగ్యులర్‌గా ఎదుర్కొంటున్నారు. చిరిగిన ,వాడేసిన డ్రస్సులు పంపడం, సైజులు మారడం, ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు వేరేది రావడం వంటివి వెరీ కామన్ అన్నట్లుగా ఉంది.

సెలబ్రెటీలు పోస్ట్ పెట్టగానే ఆ కంపెనీ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పడమో, నష్టపరిహారం అందించడమో చేస్తాయి. కానీ నార్మల్ కస్టమర్లు.. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే గంటల తరబడి వేచి చూడటం, లేదా చాట్ బాట్‌లతో విసిగిపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

మొదటగా, డ్రస్సులు లేదా ఏదైనా వస్తువు డెలివరీ అయినప్పుడు అన్‌బాక్సింగ్ అంటే ప్యాకెట్ విప్పేటపుడు వీడియో తీయడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల వస్తువులో ఏమైనా సమస్యలు ఉంటే కంపెనీకి బలమైన సాక్ష్యంగా చూపించవచ్చు.

Trisha
Trisha

సాధారణంగా ఇప్పుడు అన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఈజీ రిటర్న్ , రీప్లేస్‌మెంట్ పాలసీ ఉంటుంది. వస్తువు నచ్చకపోయినా, క్వాలిటీ బాగోకపోయినా వెంటనే రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాలి. ఒకవేళ కస్టమర్ కేర్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోతే, ఆ కంపెనీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ అయిన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వంటివాటిని ట్యాగ్ చేస్తూ సమస్యను ఓపెన్‌గా త్రిషలా వివరించాలి. దీనివల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో కంపెనీలు త్వరగా రెస్పాండ్ అవుతాయి.

ఇవన్నీ దాటి కంపెనీలు కస్టమర్లను మోసం చేయాలని చూస్తే మాత్రం, జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH) ఉండనే ఉంది. వినియోగదారులు 1915 నెంబర్‌కు ఫోన్ చేసి లేదా వారి అధికారిక యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. బ్రాండెడ్ కంపెనీలు కస్టమర్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని క్వాలిటీ లేని వస్తువులను అందిస్తే న్యాయం పొందే హక్కు కస్టమర్లకు ఉంది.

Date Of Birth : ఈ నెంబర్ వారికి పెండింగ్ పనులు పూర్తి.. ఆ సంఖ్య వారు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..

Related Articles

Back to top button