Upasana Konidela : యాంకర్ సుమపై ఉపాసన ప్రశంసలు.. ఆ మహిళలకు ఉపాసన వార్నింగ్..
Upasana Konidela : యాంకర్ సుమపై ఉపాసన కొణిదెల ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల మధ్య ఉండాల్సిన ఐక్యతపై ఉపాసన మాట్లాడిన పవర్ఫుల్ స్పీచ్ వైరల్ అవుతోంది.
Upasana Konidela
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల(Upasana Konidela) ఎక్కడ మాట్లాడినా ఆ మాటల్లో ఒక క్లారిటీ, మెచ్యూరిటీ, పవర్ కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న ఉపాసన.. ప్రముఖ యాంకర్ సుమ కనకాలపై ప్రశంసల వర్షాన్ని కురిపించడమే కాకుండా, సొసైటీలో తోటి మహిళలకు అన్యాయం చేసే వారిని ఉద్దేశించి ఘాటు కామెంట్లు చేశారు. ఆ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తాను ఈవెంట్‌కి రాగానే సుమను ఎలా ఉన్నారని అడిగితే, దానికి నేను ఎక్సలెంట్ స్థానంలో ఉండిపోయానని ఆమె చెప్పిన ఆన్సర్ తనను బాగా ఆకట్టుకుందని ఉపాసన చెప్పారు. సుమలో ఉన్న కాన్ఫిడెన్స్, పవర్, విజయం అన్నీ ఆమె అంతరంగంలో నుంచే వచ్చాయన్నారు. ఎన్నో ఆడియో ఫంక్షన్లలో లైవ్ షోలు ఏ మాత్రం బోర్ కొట్టకుండా, షోను నిలబెట్టే వెలుగు సుమ అని.. ఎంతోమంది గుండెచప్పుడును ఆమె తన మాటలతో చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారని, అందరికీ స్పూర్తిగా నిలిచే సుమకు ధన్యవాదాలు అంటూ ఉపాసన చెప్పారు.
అయితే ఇదే మహిళల ప్రవర్తనపై ఉపాసన(Upasana Konidela) చేసిన కామెంట్లు నేటి మహిళలలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. మనకు ఎంతోమంది స్త్రీల సహాయం అవసరం ఉంది. కానీ తన రీసెర్చ్‌లో తేలిందేంటంటే.. కొందరు మహిళలు తమ స్వార్థం కోసం, తమ స్వంత విజయం కోసం లేదంటే ఒక బలహీనమైన పురుషుడిని మెప్పించడం కోసం తోటి మహిళలను తొక్కి పైకి రావాలని చూస్తున్నారని ఉపాసన సున్నితంగా క్లాస్ పీకారు.
అంతేకాదు అలాంటి వారికి తనదొక హెచ్చరిక అని.. ఒక మహిళ బాధ మరొకరి విజయం కాకూడదని ఉపాసన కాస్త ఘాటుగానే అన్నారు. మనం కలిసి పైకి ఎదగాలంటే, ఒకరికొకరం అండగా నిలబడాలన్న ఆమె.. ఈ విషయంలో మనందరి ఆలోచనా విధానం మారాలని పిలుపునిచ్చారు.
తోటి మహిళలకు అన్యాయం చేసిన వారెవరయినా తమ తప్పు తెలుసుకుని మారడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలని కొణిదెల వారి కోడలు అభిప్రాయపడ్డారు. స్వార్థం లేకుండా మహిళా సాధికారత కోసం పనిచేసే మంచి మనసున్నవారి మధ్య ఉండడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఉపాసన తన స్పీచ్ ముగించారు. అయితే ఉపాసన నోటి నుంచి వచ్చిన ఈ పవర్ఫుల్ మెసేజ్‌పై నెట్టింట కొత్త చర్చకు దారి తీసింది.
Decision : లైఫ్‌లో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? కన్ఫ్యూజన్కు ఇలా చెక్ పెట్టండి..





