Just EntertainmentLatest News

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..పవన్ హిట్టు కొట్టాడా ?

Ustaad Bhagat Singh : టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండుగే... మిగిలిన హీరోల సంగతి ఎలా ఉన్నా పవన్ ను దేవుడిలా కొలిచే ఫ్యాన్స్ హడావుడి మాములుగా ఉండదు

Ustaad Bhagat Singh

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండుగే… మిగిలిన హీరోల సంగతి ఎలా ఉన్నా పవన్ ను దేవుడిలా కొలిచే ఫ్యాన్స్ హడావుడి మాములుగా ఉండదు. చాలా రోజుల తర్వాత ఓజీ మూవీతో అభిమానులను ఖుషీ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) తో అలరించబోతున్నాడు.

టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ ఇన్నేళ్ల తర్వాత రిపీట్ అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ వీరాభిమాని హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. నేటి రాత్రికే అమెరికాలో షోలు పడనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

తెలంగాణలో ప్రీమియర్స్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసినా పవన్ సినిమా కోసం అందరూ ఆతృతగానే ఎదురుచూస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెబుతాడేమోనని అనుకున్న అభిమానుల కోసం పవన్ వెండితెరపై సందడి చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్తో మరోసారి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సెన్సార్ సభ్యుల కోసం ఇప్పటికే ప్రదర్శించగా దీనిపై రివ్యూ కూడా పాజిటివ్ గానే వచ్చింది.

Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh

ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మొత్తం పవన్ వన్ మ్యాన్ షో అనీ, అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ కోసం పవన్ చేసిన డాన్సులు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని చెబుతున్నారు. అలాగే పవన్ డైలాగ్ మాస్ లుక్ , డైలాగ్స్ ఇప్పటికే ట్రెండ్ అయ్యాయి. హీరోయిన్ శ్రీలీలతో పవన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టు కూడా టాక్ వచ్చింది.

నెగెటివ్ క్యారక్టర్ చేసిన పార్థీబన్ తో పవన్ యాక్షన్ సీన్స్ బాగా వచ్చాయని, అభిమానులకు పండగేనని చెబుతున్నారు. పాటల్లో మాత్రం ఒకటిరెండు మినహా మిగిలినవి యావరేజ్ గా ఉన్నాయంటున్నారు. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ , ఫైట్స్ తో పాటు రాశి ఖన్నా క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అయ్యాయని సమాచారం. ముఖ్యంగా తన బీజీఎంతో ఓజీ సినిమా హిట్ కు కారణమైన థమన్ మరోసారి అదరగొట్టేశాడంటున్నారు.

Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh

పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే ఖర్చు చేసింది. ఒక అభిమానిగా పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అలాగే చూపించి గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న హరీశ్ శంకర్ మరోసారి అలాంటి హిట్ నే అందించాడని అంటున్నారు.

ఓజీ కంటే ముందు వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే పవన్ లుక్ కూడా అదిరిపోవడంతో….. ఫ్యాన్స్ కు వింటేజ్ పవర్ స్టార్ కనిపిస్తాడని చెబుతున్నారు. మొత్తం మీద పవన్ వన్ మ్యాన్ షోతో ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఉగాదికి అభిమానులను అలరించబోతున్నాడంటూ ఫస్ట్ రివ్యూ ప్రకారం తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button