Akhanda Vellulli :అఖండ వెల్లుల్లి పేరు విన్నారా? వినకపోతే అర్జంటుగా దీని గురించి తెలుసుకోండి..
Akhanda Vellulli : సాధారణ మార్కెట్లలో కంటే ఆన్‌లైన్ స్టోర్లలో లేదా ఆర్గానిక్ షాపులలో హిమాలయన్ గార్లిక్ లేదా అఖండ గార్లిక్ పేరుతో దొరుకుతుంది.
Akhanda Vellulli
సాధారణంగా మనం రెగ్యులర్‌గా వాడే వెల్లుల్లిలో పాయలు పాయలుగా రెబ్బలు ఉంటాయి. కానీ అఖండ వెల్లుల్లి అనే పేరు కొత్తగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీంతో ఏంటీ అఖండ వెల్లుల్లి(Akhanda Vellulli ) అని ఆరా తీయడం మొదలుపెడుతున్నారు నెటిజన్లు.
అఖండ వెల్లుల్లి చూడటానికి మామూలు వెల్లుల్లిలా ఉన్నా .. గడ్డ మొత్తం ఒకే ఒక్క పాయగా ఉండటం దీని ప్రత్యేకత. దీనిని అఖండ వెల్లుల్లి లేదా సింగిల్ క్లోవ్ గార్లిక్ అంటారు. ఇది ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ, సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులోనూ పండుతుందట. అక్కడి గడ్డకట్టే చలిని తట్టుకుని పెరగడం వల్లే దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
సాధారణ వెల్లుల్లి తో పోలిస్తే ఇది సుమారు ఏడు రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీనిని కేవలం వంటల కోసమే కాకుండా ఒక ఔషధంగా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఈ అఖండ వెల్లుల్లి (Akhanda Vellulli )స్పెషాలిటీ ఏమిటంటే, దీనిలో అల్లిసిన్ అనే పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్ చేయడంలోనూ, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. అంతేకాదు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, శ్వాసకోస వ్యాధులతో బాధపడేవాళ్లు ఈ వెల్లుల్లిని తినడం వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి ఇది సహకరిస్తుంది. అలాగే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఇది సాధారణ మార్కెట్లలో కంటే ఆన్‌లైన్ స్టోర్లలో లేదా ఆర్గానిక్ షాపులలో హిమాలయన్ గార్లిక్ లేదా అఖండ గార్లిక్ పేరుతో దొరుకుతుంది.
ఈ అఖండ వెల్లుల్లి(Akhanda Vellulli ) ని నేరుగా పచ్చిగా తీసుకోవడమే మంచిదట. దీని పైన ఉండే పొట్టును తీసి, లోపల ఉండే గడ్డను చిన్న ముక్కలుగా కోసి, ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటితో కలిపి మింగేయాలి. ఇలా చేయడం వల్ల దానిలోని అల్లిసిన్ డైరక్టుగా రక్తంలోకి చేరి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందట.

ఒకవేళ పచ్చిగా తినడం వల్ల కడుపులో మంటగా కనుక అనిపిస్తే, ఆ ముక్కలను కాస్త తేనెలో కలిపి తీసుకోవచ్చు. తేనెతో కలిపి ఇలా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఘాటు కూడా బాగా తగ్గుతుంది.
అలాగే ఈ వెల్లుల్లిని సన్నని ముక్కలుగా కోసి సలాడ్లలో గానీ లేదా వంటలు పూర్తయ్యే సమయంలో గానీ వేసుకోవచ్చు. కానీ దీనిని వేయించడం లేదా ఉడికించడం చేయకూడదట. ఎందుకంటే అధిక వేడి వల్ల దానిలోని ఔషధ గుణాలు నశించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దీనిని అధిక బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణక్రియ సమస్యలున్నవారు దీనిని నిరభ్యంతరంగా వాడొచ్చు. కానీ గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. దీనికి రక్తాన్ని పల్చబరిచే గుణం ఉండటం వల్ల.. ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నవారు, రక్తం పల్చబడటానికి మందులు వాడే వారు దీనికి దూరంగా ఉండాలి.




ib3brx