Cucumber Mint Juice : నడుము చుట్టూ ఫ్యాట్ ఈజీగా కరిగిపోవాలా?.. పరగడుపున ఈ డ్రింక్ ట్రై చేయండి..
Cucumber Mint Juice : దోసకాయలో ఉండే పీచు పదార్థం, పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ , కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. బాడీని ఇంటర్నల్‌గా శుభ్రం చేయడానికి ఇది సూపర్ డీటాక్స్ డ్రింక్‌లా హెల్ప్ చేస్తుంది.
Cucumber Mint Juice
మారుతున్న అలవాట్లు, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది రకరకాల ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా గంటల తరబడి కదలకుండా కూర్చుని పని చేసే జాబుల వల్ల వెయిట్ పెరగడం అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారింది.
దీనికోసం వేలు, లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కంటే.. ఇంట్లోనే సింపుల్‌గా హోమ్ రెమెడీని చేసుకుని దీనికి చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డైలీ చేసే చిన్నపాటి ఎక్సర్‌సైజులతో పాటు ఉదయాన్నే ఈ దోసకాయ, పుదీనా(Cucumber Mint Juice) కాంబినేషన్‌తో.. డ్రింక్ తాగితే బాడీ చాలా ఫాస్ట్‌గా మంచి షేప్‌లోకి వస్తుంది.
రాత్రంతా మన శరీరం విశ్రాంతి తీసుకునే టైమ్‌లో కొన్ని మలినాలు లోపల పేరుకుపోతాయి. అందుకే ఉదయాన్నే లేవగానే ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరం లోపల ఉన్న మురికినంతా క్లీన్ చేసేస్తుంది.
దోసకాయలో ఉండే పీచు పదార్థం, పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ , కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. బాడీని ఇంటర్నల్‌గా శుభ్రం చేయడానికి ఇది సూపర్ డీటాక్స్ డ్రింక్‌లా(Cucumber Mint Juice) హెల్ప్ చేస్తుంది.
విపరీతంగా బరువు పెరిగిపోయి, పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వుతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే దీనిలో క్యాలరీలు అస్సలు ఉండవు.పైగా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ.
పొద్దున్నే ఈ జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం బూస్ట్ అయి ఫ్యాట్ వేగంగా కరగడం స్టార్ట్ అవుతుంది. దీన్ని తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కూడా వచ్చి, ఎక్కువ సేపు క్రేవింగ్స్ రాకుండా ఆకలిని కంట్రోల్ చేస్తుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇదొక మంచి హోమ్ మేడ్ మెడిసిన్‌లా పని చేస్తుంది. పుదీనాలో ఉండే నేచురల్ గుణాలు జీర్ణక్రియను యాక్టివేట్ చేస్తాయి. దీనివల్ల తిన్నది త్వరగా డైజెస్ట్ అవుతుంది.
దోసకాయ ఇచ్చే కూలింగ్ ఎఫెక్ట్ వల్ల కడుపులో మంట, ఎసిడిటీ వంటివి వెంటనే తగ్గుముఖం పడతాయి. పరగడుపున ఇది తీసుకోవడం వల్ల పొట్ట చాలా తేలికగా మారుతుంది.

స్కిన్ హెల్దీగా , గ్లోయింగ్‌గా ఉండాలంటే మన శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఈ డ్రింక్‌లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మొటిమలు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. రెగ్యులర్‌గా ఈ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ శుద్ధి జరిగి, చర్మం నేచురల్‌గానే కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది.
దోసకాయలో సుమారు 95 శాతం వాటర్ ఉంటుంది. కాబట్టి పొద్దున్నే ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి. దీనివల్ల నీరసించిపోకుండా రోజంతా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉండొచ్చు.
Kiwi : విటమిన్ల నిధి కివీ పండు.. బ్యూటీతో పాటు ఇమ్యూనిటీ పెంచే సూపర్ డ్రింక్





